కొవిడ్ టీకా చాలా సురక్షితమని.. అందరూ తప్పకుండా తీసుకోవాలని సూచించారు డీజీపీ మహేందర్‌రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఆయన హైదరాబాద్‌లోని తిలక్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా వేయించుకున్నారు. పోలీసు సిబ్బంది, అధికారులు అందరూ వ్యాక్సినేషన్‌లో పాల్గొనాలని డీజీపీ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఉన్న పోలీసులు అధికారులు, సిబ్బందికి విజ్ఞప్తి. ఈ వ్యాక్సిన్ చాలా సురక్షితం. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నా. ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి వారందరూ వ్యాక్సిన్ తీసుకునేలా పోలీసులు పని చేయాలని కోరుతున్నా. సంవత్సర కాలంగా ప్రజల కోసం సొంత రక్షణ కూడా వదిలేసి పనిచేసిన వైద్య సిబ్బందికి తెలంగాణ పోలీసుల తరఫున ధన్యవాదాలు.
--- మహేందర్‌రెడ్డి, డీజీపీ
ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని పలు కేంద్రాల్లో పోలీసులు టీకాలు వేయించుకున్నారు. తొలి విడతలో ఆరోగ్య సిబ్బందికి ప్రాధాన్యమివ్వగా... కొంతమంది అపోహలతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రాలేదు. పోలీసు శాఖలో అలాంటి అపోహలు రాకుండా డీజీపీ స్వయంగా టీకా వేయించుకున్నారు
ఇదీ చూడండి: వ్యాక్సిన్ లెక్క.. ఈమె తేలుస్తుంది!