ETV Bharat / state

Omicron Variant: విదేశాల నుంచి భారత్​కు వచ్చే ప్రయాణికులపై ఈ పరీక్షలు తప్పనిసరి - new corona variant

shamshabad airport covid alert: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు అమలవుతోన్నాయి. విదేశీ మంత్రిత్వ శాఖ ఆదేశాలకు 11 దేశాల నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షల ఫలితాల్లో పాజిటివ్ వస్తే గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స, క్వారంటైన్‌లోకి పంపుతున్నారు.

Omicron Variant: విదేశాల నుంచి భారత్​కు వచ్చే ప్రయాణికులపై ఈ పరీక్షలు తప్పనిసరి

author img

By

Published : Dec 2, 2021, 5:07 AM IST

shamshabad airport covid alert: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ కట్టడికి అన్ని దేశాలు చర్యలు చేపట్టాయి. ఈ కొత్త వేరియంట్ నేపథ్యంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు అమలవుతోన్నాయి. విదేశీ మంత్రిత్వ శాఖ ఆదేశాలకు 11 దేశాల నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ శంషాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించారు. కొవిడ్ పరీక్షల ఏర్పాట్లు, నిర్వహణ వంటి అంశాలు పరిశీలించారు.

బ్రిటీష్ ఏయిర్‌వేస్ నుంచి వచ్చిన 200 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. యూరప్‌, యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బోట్స్​వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంగ్‌కాంగ్‌, ఇజ్రాయెల్‌ వంటి రిస్క్ దేశాలను వస్తున్న విదేశీ ప్రయాణికులకు జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తప్పనిసరిగా ఈ పరీక్షలు చేపడుతున్నారు. ఆ పరీక్షల ఫలితాల్లో పాజిటివ్ వస్తే గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స, క్వారంటైన్‌లోకి పంపుతున్నారు. నెగిటివ్ వస్తే విమానాశ్రయం వెలుపలకు పంపుతున్నారు. రిస్క్‌ లేని గల్ఫ్ వంటి దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు మాత్రం 2 శాతం మందికి ర్యాండమ్‌గా ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం యూకే నుంచి మాత్రమే ప్రయాణికులు వస్తున్నారని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:

బూస్టర్ డోసుగా కొవిషీల్డ్​.. అనుమతులు కోరిన సీరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.