ETV Bharat / state

Gurukula School: గురుకుల ప్రవేశ పరీక్షలపై సందిగ్ధం

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. కరోనా రెండో దశ ఉద్ధృతితోపాటు మూడో దశ ఉంటుందన్న ఊహాగానాలతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా.. ప్రవేశ పరీక్షల నిర్వహణపై గురుకుల సొసైటీలు సమాలోచనలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎస్సీ గురుకుల సొసైటీ జూనియర్‌ ఇంటర్‌ ప్రవేశ పరీక్షను రద్దుచేసింది. 2021-22 విద్యాసంవత్సరం ప్రారంభంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా ప్రవేశాలపై ముందుకు వెళ్లాలని ఆయా గురుకుల సొసైటీలు భావిస్తున్నాయి.

covid-effect-on-gurukul-entrance-exams
Gurukula School: గురుకుల ప్రవేశ పరీక్షలపై సందిగ్ధం
author img

By

Published : Jun 3, 2021, 7:31 AM IST

ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించాల్సిన టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ సెట్‌-2021(TSWRJC CET-2021)... కరోనా నేపథ్యంలో రద్దయింది. పదో తరగతిలో సాధించిన గ్రేడు, సీజీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. గురుకులాల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 7వ తేదీలోపు సబ్జెక్టుల వారీగా మార్కులు, సీజీపీఏ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(Center Of excellence)లో ప్రవేశానికి ఇప్పటికే తొలిదశ పరీక్ష జరిగింది. మేలో రెండోదశ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే.. ఇప్పట్లో రెండో దశ పరీక్షను నిర్వహించడం సాధ్యం కాదని, తొలిదశ పరీక్ష మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని సొసైటీ నిర్ణయించింది.

ఐదో తరగతి ప్రవేశాలపై..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం లక్ష మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. 2020-21 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం గత నవంబరులో పరీక్ష నిర్వహించి, ప్రవేశ ప్రక్రియను ముగించేలోపే రెండో దశ కరోనా మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రవేశ పరీక్ష నిర్వహించాలా? వద్దా? ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలా? అని సొసైటీలు తర్జనభర్జన పడుతున్నాయి. మైనార్టీ సొసైటీ తరహాలో లాటరీ పద్ధతి(Lottery Method)లో ఐదో తరగతి ప్రవేశాలను నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి.

బీసీ కళాశాలల్లో దరఖాస్తుకు 15 వరకు గడువు

బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని 68 బాలుర, 70 బాలికల జూనియర్‌ కళాశాలల్లో కలిపి 12,500కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ఈనెల 15వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. గడువు పూర్తయిన తరువాత ప్రవేశాలపై నిర్ణయం తీసుకోవాలని సొసైటీ భావిస్తోంది.

ఇదీ చూడండి: Farmer help: విత్తనాలపై రాయితీ... ముందుకొచ్చిన అభ్యుదయ రైతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.