ETV Bharat / state

అడ్డా కూలీలపైనా కొవిడ్ ఎఫెక్ట్.. దుర్భరంగా మారిన స్థితిగతులు

author img

By

Published : Aug 11, 2020, 2:17 PM IST

కరోనా కొత్త కష్టాలనే కాదు... జీవనోపాధులను సైతం ఘోరంగా దెబ్బతీసింది. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన కొవిడ్ వైరస్ రోజూ వారీ కార్మికులు... ప్రత్యేకించి అడ్డా కూలీలపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతోంది. దేశంలో... ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు, పట్టణాల్లో కూలీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. విశ్వనగరం హైదరాబాద్‌లోనూ కూలీ పనులకు పిలిచే నాథుడే లేకపోవడం వల్ల ప్రధాన కూడళ్లు, కేంద్రాల్లో రోడ్లపై ఎవరైనా పనికి పిలుస్తారన్న ఆశతో పడిగాపులు పడుతున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ... సొంత ఊర్లకు వెళ్లలేక... నగరంలో ఉండలేక... రెంటికి చెడ్డ రేవడిలా కార్మికులు తమ బతుకులు వెళ్లదీస్తున్న తీరు దయనీయంగా మారింది.

అడ్డా కూలీలపైనా కొవిడ్ ఎఫెక్ట్.. దుర్భరంగా మారిన స్థితిగతులు
అడ్డా కూలీలపైనా కొవిడ్ ఎఫెక్ట్.. దుర్భరంగా మారిన స్థితిగతులు

కరోనా నేపథ్యంలో అన్ని రంగాల్లో పరిస్థితులు మారిపోయాయి. గ్రామీణ రంగాలు సైతం తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఫలితంగా ఉపాధి అవకాశాలు కొరవడుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఇతర వృత్తిదారులు తమ కుటుంబాలతో కలిసి సొంత గ్రామాలబాట పడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో సొంత గ్రామాలకు వెళ్లలేక... ఒకవేళ వెళ్లినా ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ భయంతో స్థానికుల నుంచి నిరసన, తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మళ్లీ నగరం, పట్టణాలబాట పడుతున్నారు.

కొలువు దేవుడెరుగు... కూలీ దిక్కులేదు...

నగరాల్లో ప్రైవేట్ సంస్థల్లో కొలువులు దేవుడు ఎరుగు... కనీసం బయట ఉపాధి, కూలీ పనుల అవకాశాలూ కానరాకుండా పోయాయి. ఫలితంగా ఎన్నో పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. విశ్వనగరం హైదరాబాద్ జంట నగరాల్లో అడ్డా కూలీల పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది. రెక్కాడితే డొక్కాడని వేలాది మంది కార్మికులు బతుకుదెరువు కోసం ఏ పని దొరికితే అదే చేసేందుకు సిద్ధపడుతున్నారు.

ఎన్నో కుటుంబాలు రోడ్డున...

అయినప్పటికీ... పనులకు పిలిచే నాథుడే లేకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రోజూ ఉదయం 6 గంటలకు అడ్డాపైకి వచ్చి ఎవరు పిలుస్తారా అని గంటల కొద్దీ ఎదురు చూస్తుంటే ఒక్క కూలీ దొరికితే రూ.500-800 వరకు లభిస్తాయి. ఏ కూలీ లేకుంటే జీహెచ్‌ఎంసీ సరఫరా చేసే 5 రూపాయల భోజనంతో కడుపు నింపుకుంటున్నామని అడ్డా కూలీలు వాపోతున్నారు.

ఉపాధి కోసం వెంపర్లాట...

లాక్‌డౌన్ ఆంక్షలు దశల వారీగా ఎత్తేస్తున్న క్రమంలో కూలీ, ఉపాధి అవకాశాల కోసం కూలీ చేసుకునే వెంపర్లాడాల్సిన దుస్థితి నెలకొంది. ఎటు వెళ్లాలన్నా ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడం, అధిక ధరలు వెచ్చించి ఆటోల్లో వెళ్లాల్సి వస్తుండటం, పేద కుటుంబాలు, కూలీలపై అదనపు భారం పడుతోంది. ఛౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ బియ్యం లభించినప్పటికీ ఇళ్ల అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, నల్లా బిల్లులు చెల్లించలేక అనేక కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నారు.

నగరంలోనే దుర్భర జీవితం..

కనీసం స్వగ్రామాలకు వెళ్లి సేద్యం లేదా కూలీనాలీ పనులు చేసుకుందామంటే... ఊళ్లో ఇల్లు వాకిలీ, సెంటు భూమి లేదు. గత్యంతరం లేక జంట నగరాల్లో జీవితాలు దుర్భరంగా వెళ్లదీస్తున్నారు. కుటుంబ సభ్యులను సొంత గ్రామాల్లోనే వదిలేసి... నగరంలో ఉండాల్సి వస్తోంది. కొందరైతే... సొంత ఊర్లకు వెళితే... స్థానికులు హైదరాబాద్‌ నుంచి కరోనా ఉందంటూ... వారితో మాట్లాడకుండా... బయటకు రావద్దంటూ సహాయ నిరాకరణ, సూటిపోటి మాటలు చేస్తుండటంతో మళ్లీ వెనుదిరగాల్సి వస్తోంది.

అది శుభ్రం చేస్తామన్నా పని లేదు...

మట్టి పని, సుతారి పని, చివరకు మరుగు దొడ్లు శుభ్రం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా... పని దొరక్క ఒక్కో రోజు తినడానికి తిండి దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా ధాటికి తమ పరిస్థితులు హీనంగా తయారయ్యాయని అడ్డా కూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

నగరంలోనే తిండికి తిప్పలు...

ఏపీ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి కూలీ, ఉపాధి పనుల కోసం వచ్చిన కుటుంబాలు... ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డులతో పాటు హైదరాబాద్‌ వాసీలుగా గుర్తింపు పొందారు. ఈ తరుణంలో సొంత రాష్ట్రం ఏపీ పోదామంటే అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు లేకపోవడంతో నగరంలోనే తిండికి తిప్పలు పడుతున్నారు.

ఎప్పుడు బయటపడతామో తెలియదు...

కరోనా కల్లోలం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర, రాష్ట్రాలు ప్రత్యేక చొరవ తీసుకుని ఇంటి కిరాయిలు, విద్యుత్ ఛార్జీలు, నల్లా బిల్లులు లేకుండా తమను ఆదుకోవాలని కూలీలు విజ్ఞప్తి చేశారు. ఈ దుస్థితి నుంచి ఎప్పుడు బయటపడతామో అన్న బెంగలో అడ్డా కూలీల్లో భయోత్పాతం నెలకొంది. ఈ తరుణంలో బతికి బట్ట కట్టేదెలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవీ చూడండి : ఎగువ కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.