ETV Bharat / state

మళ్లీ విస్తరిస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్ లో అధికంగా కేసులు నమోదు - తెలంగాణ లో కొవిడ్ కేసులు

Covid Cases Increases In Telangana: క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిపోయింది, వ్యాప్తి క‌ట్ట‌డి అయింది, మ‌హ‌మ్మారి మ‌న మ‌ధ్య‌లో నుంచి వెళ్లిపోయింది అన్న త‌రుణంలో మ‌ళ్లీ చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. తన ఉనికి ఇంకా ఉందంటూ నిరూపిస్తోంది. ఇటీవ‌ల పెరుగుతున్న కేసులే దీనికి సాక్ష్యం.

Covid Cases
Covid Cases
author img

By

Published : Mar 16, 2023, 3:19 PM IST

Covid Cases Increases In Telangana : రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతోంది. కేసుల్లో క్ర‌మంగా పెరుగుద‌ల క‌న్సిస్తోంది. గత నాలుగు రోజులుగా వీటి సంఖ్య అంత‌కంతకూ అధిక‌మ‌వుంతోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్ కేసులు పెర‌గ‌టం ఆందోళ‌న క‌లిస్తోంది. ఈ ఏడాది జనవరి 27న రాష్ట్రంలో సున్నా కేసులు నమోదయ్యాయి. దీంతో వైర‌స్ బాధ త‌ప్పింద‌ని అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

కానీ ఈ ఇటీవ‌ల వారం రోజుల నుంచి కేసుల సంఖ్య ఎక్కువ అవుతోంది. దాదాపు 50 శాతానికి పైగా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతుండటంతో న‌గ‌ర వాసులు భ‌య‌ప‌డుతున్నారు. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,254 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే.. అందులో 52 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 148 మంది ఫలితాలు రావాల్సి ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇక ఈ నెల 1 వ తేదీన రాష్ట్రంలో 4,405 మందికి కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా... అందులో 21 మందికి మాత్ర‌మే పాజిటివ్ వ‌చ్చింది. ప్రస్తుతం తెలంగాణలో 267 మంది కొవిడ్ బాధితులు ఉన్నారు. వీరి సంఖ్య ఈ నెల మొదటి తేదీ నాటికి 93 మాత్రమే కావటం గమనార్హం. గ‌డ‌చిన అయిదు రోజుల్లో కేసుల్లో పెరుగుద‌ల న‌మోద‌వుతున్న‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి.

జిల్లాల్లోనూ వైరస్ వ్యాపి పెరుగుతున్న‌ట్లు అధికారిక నివేదికలు తెలుపుతున్నాయి. సరిగ్గా రెండు వారాల క్రితం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ సహా మొత్తం అయిదు జిల్లాల్లో మాత్రమే కేసులు ప‌రిమితం అయ్యాయి. హైద‌రాబాద్ మిన‌హా ఇత‌ర జిల్లాల్లో ఒకటి, రెండు కేసులు మాత్రమే వెలుగు చూసిన పరిస్థితి.

12 జిల్లాల్లో కేసుల పెరుగుద‌ల : అయితే ఇప్పుడు ఏకంగా 12 జిల్లాల్లో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్ , మేడ్చల్-మల్కాజ్ గిరి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి , భువవగిరి జిల్లాల్లో నిత్యం కరోనా బాధితులు పెరుగుతున్నారు. ఇక ప్రభుత్వ నివేదికల ప్రకారం తాజాగా వస్తున్న కొవిడ్ కేసుల్లో కనీసం 50 శాతం పైగా హైదరాబాద్ నగరంలోనే వ్యాప్తి చెందుతుండటం గమనార్హం.

అసలే ఓ వైపు రాష్ట్రంలో ఇన్‌ఫ్లుయెంజా వైర‌స్ వ్యాప్తి, సాధారణ ఫ్లూ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. వాటికి క‌రోనా వైర‌స్ తోడైతే ప‌రిస్థితి మ‌రింత క్లిష్టంగా మారే అవ‌కాశ‌ముంటుంది. మ‌రోవైపు మరోవైపు పరీక్షల సమయం కావటంతో.. అటు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు భ‌యాందోళ‌న‌లు చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంట‌నే వైద్యులను సంప్రదించాలని, వారి స‌ల‌హాల మేర‌కు అవ‌స‌ర‌మైతే ఆసుప‌త్రుల్లో చేరాల‌ని చెబుతున్నారు. అంతేకానీ నిర్లక్ష్యం చేస్తు త‌ర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.