కొవిడ్ థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే ఊహాగానాలు, హెచ్చరికల నేపథ్యంలో పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం, వ్యాక్సిన్ కంపెనీలు కసరత్తును వేగవంతం చేశాయి. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్.. పిల్లలపై ఇప్పటికే వ్యాక్సిన్ ట్రయల్స్‌ను ప్రారంభించగా వాటి ఫలితాలు ఈ ఏడాది సెప్టెంబర్ లోపు వెలువడే అవకాశాలున్నాయి.
దిల్లీలోని ఎయిమ్స్, బిహార్ పట్నాలోని చెలువంబ ఆస్పత్రి, మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని మెడిట్రినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, యూపీ కాన్పూర్‌లోని ప్రకార్ హాస్పిటల్లో కొవాగ్జిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. త్వరలో హైదరాబాద్‌లోని ప్రనమ్ ఆస్పత్రిలోనూ పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ జరగబోతున్నాయి.
ఫలితాల ఆధారంగా
పిల్లలపై వ్యాక్సిన్ ఫేజ్-2, ఫేజ్-3 ట్రయల్స్ ఫలితాలు ఈ ఏడాది సెప్టెంబర్ వరకు వెలువడుతాయి. ఆ ఫలితాల ఆధారంగా అప్పటి నుంచే పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. కొవాగ్జిన్‌తో పాటు.. ఫైజర్, జైడస్ క్యాడిలా వ్యాక్సిన్లను సైతం పిల్లలకు టీకా వేసేందుకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కేంద్రం ప్రయత్నాలను వేగవంతం చేసింది.
ఇదీ చదవండి: MINISTER KTR: పక్కనే దవాఖానా, ఫంక్షన్ హాల్ కట్టిస్తాం..: కేటీఆర్