హైదరాబాద్ సనత్నగర్లో మానవత్వం మరచి విచక్షణారహితంగా ఓ విద్యార్థిపై దాడి చేశారు. రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిపై దాడికి తెగబడింది ఓ మహిళ. స్కూల్ విద్యార్థులు ఆటలు ఆడుకుంటున్నారంటూ అమాయక బాలుడిపై దంపతులిద్దరూ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అతను ఏమి చేయలేదు అంటూ మరో విద్యార్థి బతిమిలాడినా వినలేదు.
దెబ్బలను తట్టుకోలేక ఆ బాలుడు కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. ఇంత చేసి తిరిగి ఆ విద్యార్థిపైనే కేసు పెట్టారు. సీసీటీవీ దృశ్యాలు పరిశీలించిన పోలీసులు దాడికి తెగబడ్డ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. అకారణంగా తన బిడ్డపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.