ETV Bharat / state

జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు కోసం పటిష్ఠ ఏర్పాట్లు - Counting Arrangements Ghmc

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈనెల 4న ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 166 కౌంటింగ్ టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో డివిజన్​కు 14 టేబుళ్లతో కూడిన ఒక్కో కౌంటింగ్ హాల్ ఉంటుంది. హాళ్లు చిన్నగా ఉన్న 16 డివిజన్లకు రెండు హాళ్లు ఏర్పాటు చేశారు.

జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు కోసం పటిష్ఠ ఏర్పాట్లు

author img

By

Published : Dec 2, 2020, 8:05 PM IST

ఒక్కో కౌంటింగ్ హాల్​లో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి ఉంటారు. ప్రతి కౌంటింగ్ కేంద్రానికి ఒక్కో పరిశీలకుడిని నియమించారు. అభ్యర్థులు ఒక్కో టేబుల్​కు ఒక ఏజెంట్​ను నియమించుకునే అవకాశం ఉంటుంది. అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ లేదా సీసీటీవీ కెమెరా సౌకర్యం ఏర్పాటు చేస్తారు.

మొబైల్ ఫోన్లు నిషేధం..

ఏజెంట్లకు రిలీవింగ్ సౌకర్యం లేదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లను నిషేధించారు. ఏజెంట్లందరూ విధిగా ముందుగానే రిటర్నింగ్ అధికారుల వద్ద పాసులు తీసుకోవాలి. పాసులు లేని వారికి అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత రెగ్యులెట్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపడతారు.

పరిశీలకుడి అనుమతి తర్వాతే...

మొదటగా పోలైన అన్ని ఓట్ల లెక్కను సరిచూస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు అనంతరం పరిశీలకుడి అనుమతి తర్వాతే ఫలితాలు ప్రకటిస్తారు. అనుమానిత ఓట్లకు సంబంధించి రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎవరైనా అభ్యర్థులు రీకౌంటింగ్ కోరాలనుకుంటే ఫలితం ప్రకటించడానికి కంటే ముందే రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది.

లాటరీ పద్ధతి...

ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిన డ్రా తీసి ఫలితాన్ని ప్రకటిస్తారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అభ్యర్థి లేదా ఒక ఏజెంటుకు మాత్రమే అనుమతి ఉంటుంది. కొవిడ్ నేపథ్యంలో మాస్కు తప్పనిసరిగా ధరించాలని... శానిటైజర్ వాడాలని, భౌతికదూరాన్ని పాటించాలని ఎస్ఈసీ సూచించింది. బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చే వారంతా పీపీఈ కిట్లను ధరించాలని పేర్కొంది.

ఇదీ చూడండి: గ్రేటర్​లో తుదిపోలింగ్ 46.55 శాతం.. ఓల్డ్ మలక్​పేటలో రేపు రీపోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.