Counting Arrangements Completed by EC : శాసనసభ ఎన్నికల(Telangana Elections) ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 49 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 4, నిజామాబాద్ జిల్లాలో 2 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఒకే చోట కేంద్రం ఉండగా మిగిలిన 28 జిల్లాల్లో ఒకటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి.
ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రంలోకి ఎప్పుడైనా వెళ్లారా? లోపల ఏం జరుగుతుందో తెలుసా?
Telangana Elections results 2023 : ప్రతి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు లెక్కింపు కోసం ఎన్నికల సంఘం(EC) 14 చొప్పున టేబుల్ ఏర్పాటు చేయగా, పోస్టల్ బ్యాలెట్ కోసం అదనంగా మరొక టేబుల్ ఏర్పాటు చేస్తారు. 6 నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంతో అక్కడ లెక్కింపు కోసం 28 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఈవీఎంల లెక్కింపు కోసం 1766 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుళ్లు ఉంటాయి.
మొదట ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అరగంట తర్వాత ఎనిమిదిన్నరకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుంది. ఒకవేళ చివరి రౌండ్ లోపు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకపోతే పూర్తయిన తర్వాతే చివరి రౌండ్ లెక్కింపు ప్రారంభిస్తారు.
కాయ్ రాజా కాయ్ - కామారెడ్డి ఫలితంపై జోరుగా బెట్టింగ్‌లు
Assembly Elections Counting in Telangana : ప్రతి టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. తక్కువ మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో ఉదయం పదిన్నర ప్రాంతంలో మొదటి ఆధిక్యం తెలిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామని 144 సెక్షన్ అమలు ఉంటుందనీ రాచకొండ సీపీ చౌహాన్ అన్నారు.
ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో నాలుగు పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ర్యాలీలకు, బాణాసంచాలకు అనుమతి లేదని తెలిపారు.
శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. ఈవీఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - రేపు వైన్ షాపులు, రెస్టారెంట్లు బంద్