ETV Bharat / state

అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ - jayashankar university latest news

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ నెల 16 వరకు కొనసాగే తొలి విడత కౌన్సెలింగ్‌లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహరావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో సీట్లు భర్తీ చేయనున్నట్లు రిజిస్ట్రార్​ డాక్టర్​ ఎస్​.సుధీర్​ కుమార్​ స్పష్టం చేశారు.

counseling for admissions in BSc Agriculture and BSc Horticulture courses in pjtsau
అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
author img

By

Published : Dec 10, 2020, 3:29 AM IST

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తెలంగాణ ఎంసెట్-2020లో 190వ ర్యాంకు పొందిన కె.రాజేశ్వరికి ప్రవేశ పత్రాన్ని విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్‌ డాక్టర్ ఎస్.సుధీర్ కుమార్‌ అందజేసి కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. ఈ మేరకు కె.రాజేశ్వరి రాజేంద్రనగర్‌ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశం పొందింది.

వ్యవసాయ అనుబంధ కోర్సులు అభ్యసిస్తోన్న విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలతోపాటు ఉన్నత చదువులు చదువుకునే అవకాశాలున్నాయని రిజిస్ట్రార్​ పేర్కొన్నారు. ఈ నెల 16 వరకు కొనసాగే తొలి విడత కౌన్సెలింగ్‌లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహరావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో సీట్లు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: నన్ను ఎవరూ సంప్రదించలేదు.. అవన్నీ అవాస్తవం: జానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.