ఆంధ్రప్రదేశ్ విశాఖ జీవీఎంసీ 61వ వార్డు వైకాపా కార్పొరేటర్ దాడి సూర్యకుమారి ఆకస్మిక మృతి చెందారు. మల్కాపురం త్రినాధపురంలోని నివసం ఉంటున్న సూర్యకుమారి గుండెపోటుతో మరణించారు. ఇటీవల జరిగిన మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో 61వ వార్డు నుంచి ఈమె గెలుపొందారు. కార్పొరేటర్ ఆకస్మిక మరణంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
- ఇదీ చూడండి: పుట్పాత్ను ఢీ కొన్న ద్విచక్రవాహనం.. ఒకరు మృతి