ETV Bharat / state

కరోనా పేరిట ప్రైవేటు ఆస్పత్రుల దందా.. రూ.23 లక్షల బిల్​

కరోనా ఆపత్కాలంలో కార్పొరేట్ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. కొవిడ్ చికిత్స పేరిట రోగుల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. బిల్లు కట్టలేమంటూ బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నా కనికరించట్లేదు. పెండింగ్ బిల్లులు పూర్తిగా కట్టి... ఇంటికి తీసుకెళ్లండంటూ తేల్చి చెబుతున్నాయి. అధిక ఫీజులు వసూలు చేయొద్దంటూ ప్రభుత్వం హెచ్చరించినా నిబంధనలు గాలికొదిలేశాయి.

corporate hospitals charged bill for corona, corona treatment
కరోనాకు లక్షల్లో ఖర్చు, కార్పొరేటు ఆస్పత్రుల దందా
author img

By

Published : May 17, 2021, 7:41 AM IST

కరోనా బాధితులను కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. రూ.లక్షలు వసూలు చేస్తూ పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఇంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేమంటూ రోగి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నా పెండింగ్‌ బిల్లు కట్టి పేషెంట్‌ను తీసుకెళ్లండంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాయి. ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఆ ఆస్పత్రుల తీరు మారడం లేదు. కొవిడ్‌ సోకి పరిస్థితి విషమించడంతో నల్గొండకు చెందిన ఓ వ్యక్తిని హైదరాబాద్​ నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఏప్రిల్‌ 15 నుంచి మే 13 వరకు చికిత్స అందించారు. రూ.23,65,000 బిల్లు వేశారు. అప్పటికే రూ.4.5 లక్షల బిల్లు కట్టేయగా మిగిలిన డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఈ తతంగమంతా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆస్పత్రి ఇచ్చిన బిల్లు కాగితం నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. విషయం వైద్యాధికారులకు చేరింది.

corporate hospitals charged bill for corona, corona treatment
కరోనా చికిత్సకు 23 లక్షలు బిల్లు

పరోక్ష బెదిరింపు

అప్రమత్తమైన ఆస్పత్రి యాజమాన్యం మరో నాటకానికి తెర తీసింది. విషయం బయటకు పొక్కకుండా రోగి కుటుంబ సభ్యులతో రాజీకొచ్చింది. ‘సాయంత్రం వచ్చి మాట్లాడుకోండి. రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు వరకు తగ్గే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. విషయాన్ని మీడియాకు లీక్‌ చేయెద్దంటూ రోగి కుటుంబ సభ్యులను పరోక్షంగా బెదిరించే ప్రయత్నం చేసింది. చివరకు రోగి తరఫున న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు రంగ ప్రవేశం చేయడంతో కథ అడ్డం తిరిగింది. కాళ్లబేరానికొచ్చిన ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా వైద్య ఖర్చులు తీసుకునేందుకు అంగీకరిస్తూనే.. ఉత్తరం రాయించుకుని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది.’

లక్షల్లో బిల్లు.. జేబుకు చిల్లు

ప్రభుత్వం జారీ చేసిన జీవో 248 ప్రకారం కొవిడ్‌ చికిత్స అందించే ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు ఐసీయూకు రూ.9,000, ఆక్సిజన్‌ బెడ్‌కు రూ.7,000, సాధారణ వార్డుకు రూ.4,000 చొప్పున తీసుకోవాలి. కానీ నగరంలోని కొన్ని ఆస్పత్రులు ఐసీయూకు రూ.25,000 వసూలు చేస్తున్నాయి. ఇటీవలే తలాబ్‌కట్టకు చెందిన మహిళను కరోనాతో కాచిగూడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. రూ.4.10 లక్షలు కట్టారు. అదనంగా రూ.4.40 లక్షలు చెల్లించాలంటూ ఆసుపత్రి యాజమాన్యం వేధించింది. ఇలా నగరంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వ జీవోను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ప్రశ్నిస్తే మేం ఆక్సిజన్‌, పీపీఈ కిట్లు ఇతరత్రా వాటిని బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నామంటూ చెబుతున్నారు. ఆస్పత్రి బిల్లుతోపాటు వైౖద్యుల సూచన మేరకు రెమ్‌డెసివిర్‌తోపాటు ఇతర ఇంజన్షన్లు బ్లాక్‌మార్కెట్లో ఒక్కో వయల్‌కు రూ.30 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నామని, ప్లాస్మా థెరపీకి అదనంగా వేలాది రూపాయలు ఖర్ఛు అవుతున్నాయని రోగుల బంధువులు వాపోతున్నారు.

ఇదీ చదవండి: రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.