ETV Bharat / state

14 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీరుతెన్నులు

కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. దక్షిణాదిన, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు నెలలకో వైరస్‌ రకం అధికంగా వ్యాప్తిలో ఉంటోంది. అప్పటివరకు బలంగా ఉన్న వైరస్‌ క్రమంగా కనుమరుగై కొత్త కొవిడ్‌ వైరస్‌ రకం ఆధిపత్యం కన్పిస్తోంది. రూపాంతరం చెందుతున్న కొవిడ్‌ వైరస్‌లు కేసులు పెరగడానికి కారణమవుతున్నాయి. తొలిదశ ఉద్ధృతిలో ప్రధానంగా మూడు రకాల వైరస్‌లు వ్యాప్తిలో ఉండగా.. రెండో దశలో ఒకటి కనుమరుగై మరొకటి అధిక వ్యాప్తికి కారణమవుతోంది. ఒక్కోరకం మూడు నుంచి ఆరునెలల వరకు ప్రభావం చూపిస్తున్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

coronavirus-genetic-analysis-in-telugu-states-in-14-months
14 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీరుతెన్నులు
author img

By

Published : May 6, 2021, 6:51 AM IST

కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే క్రమంలో రూపాంతరం చెందుతూ వస్తోంది. కొన్నిటిల్లో ఒకేవిధంగా ఉండగా.. మరికొన్నిటిలో 2,3 ఉత్పరివర్తనాలు ఉంటున్నాయి. ఒక్కోదాంట్లో 15 వరకు మ్యుటేషన్లు ఉన్న వైరస్‌ రకాలు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి. కొమ్ముల్లో వచ్చిన మార్పులే ప్రమాదకరమైనవి కావడంతో వాటినే ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటుంటారు. ఈ మార్పులు తెలుసుకునేందుకు సీసీఎంబీతో పాటు సీడీఎఫ్‌డీ, మరికొన్ని సంస్థలు వైరస్‌ జన్యుక్రమ ఆవిష్కరణలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 30కిపైగా సంస్థలు ఈ పరిశోధనలు చేస్తున్నాయి.

నాలుగు రకాలుగా కనిపించింది..

కొవిడ్‌-19 జన్యుక్రమాల వివరాలను ‘గ్లోబల్‌ ఇనీషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఆల్‌ ఇన్‌ఫ్లూయంజా డేటా’ అనే అంతర్జాతీయ జీనోమ్‌ డేటాబేస్‌లో పొందుపరుస్తుంటారు. రోజువారీ వస్తున్న నమూనాల్లో కనీసం 5శాతం నుంచి జన్యుక్రమ ఆవిష్కరణ చేయాలని కేంద్ర మార్గదర్శకాలున్నా.. ఆచరణలో అతి తక్కువ నమూనాలనే పరీక్షిస్తున్నారు. దీంతో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌ రకం ఏదో విశ్లేషించి ఒక నిర్ధారణకు వచ్చేందుకు శాస్త్రవేత్తలు అధిక సమయం తీసుకుంటున్నారు. సీసీఎంబీ ఇప్పటివరకు వెల్లడించిన వివరాలు, అంతర్జాతీయ జీనోమ్‌ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 14నెలల కాలంలో దక్షిణాదిలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు నాలుగు రకాల కొవిడ్‌ వైరస్‌ల వ్యాప్తి ఎక్కువగా కన్పించింది.

మొదట్లో ఏ3ఐ

గతేడాది మార్చిలో తెలంగాణలో తొలి కొవిడ్‌ కేసు నమోదైంది. కొవిడ్‌-19 వైరస్‌ చైనా నుంచి ప్రపంచదేశాలకు వ్యాపించినా.. భారత్‌కు సమీపంలోని ఆసియా దేశాల నుంచి ఇక్కడికి పాకింది. దాదాపు మూడునెలల పాటు వ్యాప్తిలో ఉంది. మార్చిలో ఏ2ఏ, ఏ3, ఏ3ఐ, బీ1, బీ4, ఏ1ఏ వైరస్‌లు ఉన్నా ఎక్కువగా ఏ3ఐ రకం వ్యాప్తిని గుర్తించారు. ఏప్రిల్‌ వరకు ఇది కనిపించింది. అప్పటివరకు అంతర్జాతీయంగా వ్యాప్తిలో ఉన్న రకాలకు ఇది భిన్నంగా కన్పించింది.

తర్వాత ఏ2ఏ

దీని ఉనికి ఏప్రిల్‌ నాలుగోవారం నుంచి మొదలైంది. మూడునెలల్లో పూర్తిగా విస్తరించింది. జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ఏ2ఏ రకం ఎక్కువగా వ్యాపించింది. అప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ రకం వైరసే ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. మన దేశంలోనూ ఇదే విస్తరిస్తోందని అప్పట్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. జూన్‌ రెండో వారం తర్వాత ఏ2ఏ తప్ప ఇతర రకాల వైరస్‌ వ్యాప్తి ఉనికి పెద్దగా లేదని విశ్లేషించారు.

మొన్నటి వరకు ఎన్‌440కె

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలో సెప్టెంబరులో కొవిడ్‌ మొదటిదశ గరిష్ఠ స్థాయికి చేరిన సమయంలో ఎన్‌440కె రకం వైరస్‌ ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. అప్పటివరకు ఉన్న ఏ2ఏ, ఏ3ఐ వ్యాప్తి క్రమంగా తగ్గిపోయింది. ఎన్‌440కె రకం వైరస్‌ ఏ2ఏ కంటే పదిరెట్లు, ఏ3ఐ కంటే వెయ్యి రెట్ల అధిక ఇన్‌ఫెక్షన్‌కు గురిచేస్తుందని కొన్ని అధ్యయనాలు వెలువడ్డాయి. జనవరి వరకు దీని ప్రభావం కన్పించగా.. మార్చి నుంచి కనుమరుగవుతూ వస్తోంది.

ఎన్‌440కె కొత్తది కాదు..

‘మీడియాలో వస్తున్నట్లు ఎన్‌440కె రకం కొవిడ్‌ వైరస్‌ కొత్తది కాదు. గతేడాది నుంచి దక్షిణాదిలో వ్యాప్తిలో ఉంది. ఇప్పుడు అది తగ్గిపోయే దశలో ఉంది. విశాఖపట్నంలో 5శాతం నమూనాల్లోనూ ఈ రకం వైరస్‌ ప్రస్తుతం లేదు. త్వరలోనే కనుమరుగు కానుంది. దీని స్థానాన్ని క్రమంగా బి.1.617, బి.117 భర్తీ చేస్తున్నాయి’

- దివ్వతేజ్‌ సౌపతి, శాస్త్రవేత్త, సీసీఎంబీ

ఇప్పుడు బి.1.617

తెలుగు రాష్ట్రాల్లో మార్చి నుంచి కొవిడ్‌ రెండో ఉద్ధృతి మొదలైంది. అప్పటి నుంచి కొత్తరకం వైరస్‌ బి.1.617 వ్యాప్తి పెరగడం కనిపించింది. ఇండియన్‌ వేరియంట్‌, డబుల్‌ మ్యుటెంట్‌గా పిలిచే బి.1.617 మహారాష్ట్రలో కేసుల పెరుగుదలకు కారణమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో ఈ వైరస్‌ కన్పిస్తోంది. మరో రెండునెలలు ఈ వైరస్‌ ప్రభావం ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: 'కరోనా మూడోదశ అనివార్యం- ఎదుర్కొనేందుకు సిద్ధం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.