ETV Bharat / state

గ్రేటర్​లో కరోనా రికార్డ్.. భయాందోళనలో జనం - హైదరాబాద్​లో కరోనా వైరస్‌ తీవ్రత

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. శనివారం కూడా మరిన్ని కొత్త కేసులు నమోదవగా.. మృతుల సంఖ్య పెరుగుతోంది. మహానగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొంత మంది మంత్రులు, శాసనసభ్యులు, ఎస్​, ఎస్​టీ కమిషన్‌ ఛైర్మన్‌తో పాటు అనేక మంది ఉన్నతాధికారుల సన్నిహితులకు కరోనా పాజిటివ్‌ కారణంగా హోంక్వారంటైన్‌లో ఉన్నారు.

Corona with panic boom in hyderabad People
విజృంభిస్తోన్న కరోనా.. భయాందోళనలో ప్రజలు
author img

By

Published : Jun 14, 2020, 6:34 AM IST

ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా మెలిగేవాళ్లకు కరోనా సోకుతుండటం కలకలం రేపుతోంది. వాళ్లు స్వీయ నిర్భంధంలో ఉండగా.. జనగామ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు సైతం కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఆయన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్సీ​, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ గన్‌మెన్‌కు వైరస్‌ సోకింది. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. ఆయన కార్యాలయాన్ని వారం రోజుల పాటు మూసివేశారు. మేడ్చల్ జిల్లా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి శ్రీనివాస్‌నగర్ కాలనీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఎల్​ఎన్​ కాలనీలో వ్యక్తికి వైరస్‌రాగా అప్రమత్తమైన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

సాఫ్ట్​వేర్ ఇంజినీర్‌కు..

రామ్‌గోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని వెంగల్‌రావునగర్‌లో పారిశుద్ధ్య కార్మికురాలికి కొవిడ్‌ నిర్ధరణ అవగా.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ ఘాస్మండిలో ఓ మహిళకు మహమ్మారి సోకింది. రాంనగర్‌లోని మోహన్‌నగర్‌లో సాఫ్ట్​వేర్ ఇంజినీర్‌కు, ముషీరాబాద్‌లో నివాసముండే ల్యాబ్ టెక్నీషియన్‌కు కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. అడ్డగుట్టలో నివాసముంటూ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకగా.. గాంధీ ఆసుపత్రికి తరలించారు. ముసాపేట్‌లో ఐదుగురికి కరోనా నిర్ధరణ కావడంతో అప్రమత్తమైన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

19 మందికి కరోనా

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాంతినగర్‌లో 19 మందికి కరోనా పాజిటివ్‌ నిర్దరణ అయ్యింది. ఇటీవల మరణించిన ఓ వృద్ధురాలి అంత్యక్రియల్లో బంధువులు పాల్గొన్నారు. అనుమానంతో వృద్ధురాలి మృతదేహానికి పరీక్షలు చేయగా... కరోనా సోకినట్లుగా వైద్యులు తేల్చారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించగా.. 19 మందికి వైరస్‌ ఉందని తేలింది. అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో రెండు కేసులు నమోదు కావడం వల్ల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. రెండు కేసులు గాజులరామరం ప్రాంతంకాగా మరో రెండు నిజాంపేట్ పరిధిలో నమోదయ్యాయి. జగద్గిరిగుట్టలో ఒక్క కేసు వచ్చింది.

స్వగ్రామానికి వెళ్తుండగా..

ములుగు జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఏటూరునాగారం మండలం గోగుపల్లి శివపురానికి చెందిన వ్యక్తి హైదరాబాద్ ఐదో బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా జ్వరం రాగా.. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా అనుమానంతో ఎమ్​జీఎమ్​ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా కరోనాగా తేలింది. వెంకటాపూర్ మండలం నర్సాపూర్​కు చెందిన వ్యక్తి ఇటీవల కేశవపూర్‌లో వివాహానికి హాజరయ్యాడు. మరుసటి రోజు ములుగులో కలియ తిరిగాడు. అతనికి సైతం కరోనా వ్యాధి సోకడం వల్ల జిల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

ఇదీ చూడండి : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంట్లో మరో నలుగురికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.