ETV Bharat / state

రాష్ట్రంలో ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వ్యాప్తి

author img

By

Published : Apr 25, 2021, 8:39 PM IST

రాష్ట్రంలో మహమ్మారి ఉప్పెనలా వ్యాప్తి చెందుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్కొక్కరి నుంచి ఇంట్లో అందరికీ వ్యాప్తి చెందుతున్న వైరస్‌.. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. రాకాసి కాటుతో ప్రాణాలు విడిచిన వారికి... అందరూ ఉన్నా అనాథల్లా అంత్యక్రియలు జరపాల్సి వస్తోంది. మరోవైపు కరోనా కట్టడి చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. పలుచోట్ల టెస్టుల కొరత, ఆస్పత్రుల్లో పడకలు దొరక్క... రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.

Corona virus spreading rapidly in the state
రాష్ట్రంలో ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వ్యాప్తి
రాష్ట్రంలో ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వ్యాప్తి

ఇంట్లో ఒకరు కరోనా కోరల్లో చిక్కుకున్నా కుటుంబమంతా రాకాసి బారిన పడే పరిస్థితి. దురదృష్టవశాత్తు ఎవరు ప్రాణాలు విడిచినా కనీసం కడసారి చూపుకైనా నోచుకోని దుస్థితి. ఎవరి నుంచి వస్తుందో అంతుచిక్కదు. ఎవరిని బలిగొంటుందో తెలియదు. కరోనా విజృంభణతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నెలకొన్న విషాదగాథలివి. జిల్లాల్లో రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

విజృంభిస్తోన్న కరోనా

నిజామాబాద్‌ జిల్లాలో రోజుకు 5 నుంచి 8మంది వరకు కరోనాతో మృత్యువాత పడుతున్నారు. వందల సంఖ్య కేసులు నమోదవుతున్నాయి. శనివారం 3,912మందికి పరీక్షలు నిర్వహించగా... 763మందికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందల్వాయి మండలంలో 4 రోజుల వ్యవధిలోనే దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నవీపేటలో కరోనా లక్షణాలతో మృతిచెందిన ఓ వ్యక్తి అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబసభ్యులు ముందుకు రాకపోవటం వల్ల గ్రామ ఉపసర్పంచ్‌ దహనసంస్కారాలు పూర్తి చేశారు. జక్రాన్‌పల్లి ఠాణాకు చెందిన కానిస్టేబుల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ధర్‌పల్లి, డిచ్‌పల్లి మండలాలకు చెందిన ఇద్దరు పాత్రికేయులు వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ధర్పల్లి మండలం దుబ్బాకలో భారీగా కేసులు నమోదవటంతో... ఎస్సీ వాడను మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

ప్రాణాలతో చెలగాటమాడుతోంది..

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామ సర్పంచ్ మాధవి కొవిడ్‌ కాటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ... మృతిచెందారు. ఆమె భర్త హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వారం వ్యవధిలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోవటం తీవ్రవిషాదాన్ని నింపింది. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా సోకి... కుటుంబానికి వ్యాపించింది. ఈ క్రమంలో వారి తొమ్మిది నెలల బాబు వైరస్‌ బారిన పడి... ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మంచిర్యాలలో కరోనా కేసుల దృష్ట్యా... పట్టణంలోని క్లబ్ భవనాన్ని వంద పడకలతో క్వారంటైన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇళ్లలో ఉండలేని కరోనా బాధితుల కోసం ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించారు. ఆదిలాబాద్‌లో కరోనా మృతులకు అంత్యక్రియలు జరుపుతున్న పారిశుద్ధ్య కార్మికులను స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న సన్మానించారు.

వారాంతపు లాక్‌డౌన్‌

ములుగులో పెరుగుతున్న కేసుల దృష్ట్యా.... జిల్లా కేంద్రంలో వర్తక, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా వారాంతపు లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం చామన్‌పల్లిలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు... కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ తీర్మానించింది.

టెస్టుల నిలిపివేతతో ఆందోళన

నాగర్‌కర్నూలు జిల్లా ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిలిపివేయడంతో టెస్టుల కోసం వచ్చిన వారు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి ఆస్పత్రి వద్ద వేచి ఉంటే... సిబ్బంది వెనక్కి పంపటం సరికాదని వాపోయారు. మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్​ ఆస్పత్రి కరోనా వార్డును మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరిశీలించారు. అత్యవసర సేవల విభాగాన్ని సందర్శించి బాధితులకు అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఫార్మసీలోని మందులను పరిశీలించారు. కరోనా పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని... జాగ్రత్తలతో వైరస్​ను జయించవచ్చని మంత్రి సూచించారు.

పరిశీలించిన కలెక్టర్​

హైదరాబాద్‌ మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శ్వేతామహంతి సందర్శించారు. కరోనా రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్న కలెక్టర్‌... వైద్యసేవలకు ఇతర ప్రభుత్వ భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో రావుస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచితంగా మాస్కులు, ఆహారం, మంచినీరు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: 'కరోనా వైరస్​ వల్ల ప్రాణాలు పోకుండా చూడడమే లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.