ETV Bharat / state

పోలీస్ శాఖలో పెరుగుతున్న కరోనా బాధితులు - corona news in telangana

పోలీస్ శాఖలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు నెలలకు పైగా లాక్​డౌన్ విధుల్లో పాల్గొంటున్న కానిస్టేబుళ్లలో కొంతమంది మహమ్మారి బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

Corona virus infecting police
పెరుగుతున్న కరోనా బాధితులు... జాబితాలోకి పోలీసులు
author img

By

Published : May 28, 2020, 8:36 PM IST

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి... ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించినప్పటి నుంచి పోలీసులు చేస్తున్న కృషి కీలకమైనది. ప్రధాన రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.... ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. రోగిని గుర్తించిన దగ్గరి నుంచి... వాళ్లను అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించడం వరకూ వైద్యసిబ్బందికి వెన్నంటి ఉంటున్నారు. గాంధీ ఆస్పత్రి వద్ద షిఫ్టులవారీగా పహారా కాస్తున్నారు. కరోనా రోగి ఉన్న ప్రాంతాన్ని నియంత్రణ ప్రదేశంగా ఏర్పాటు చేస్తున్నారు. కంటైన్మెంట్​ జోన్లలో జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు... విధులు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల వలస కూలీలు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించడంతో... కూలీలను గుర్తించడం.. వారి పూర్తి వివరాలు సేకరించి రైళ్లలో వెళ్లేందుకు అనుమతి పత్రాల పంపిణీ.. వారిని దగ్గరుండి మరీ రైల్వే స్టేషన్ల దగ్గరకు ప్రత్యేక బస్సుల్లో తరలించడం సహా వారు చేయని పనిలేదు.

ఇప్పటి వరకు ఇంతమంది

ఈ క్రమంలో కొందరు పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. బుధవారం ఒక్కరోజులోనే దాదాపు 17మందికి వైరస్​ పాజిటివ్​ తేలింది. వీరిలో ఇన్​స్పెక్టర్​, ఏఎస్సై స్థాయి అధికారులు కూడా ఉన్నారు. వీళ్లందరినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు పోలీస్ శాఖలో కరోనా వైరస్ బారిన పడిన వాళ్ల సంఖ్య 29కి చేరింది. వీరిలో కుల్సుంపుర ఠాణాలో పనిచేసే కానిస్టేబుల్ మృతి చెందాడు. మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు 20మందికి కరోనా లక్షణాలు బయటపడటం వల్ల పోలీస్ ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

అధికారులేమంటున్నారు

కరోనా లక్షణాలు బయటపడిన కానిస్టేబుళ్లున్న ఠాణాలను శానిటైజ్ చేస్తున్నారు. ఆయా స్టేషన్లలో పనిచేసే సిబ్బందికి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీనికోసం గోషామహల్​లో ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించడంతో పాటు... తనిఖీల సందర్భంగా భౌతికదూరం పాటించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. 50ఏళ్లు దాటిన కానిస్టేబుళ్లు, పోలీస్ అధికారులకు సాధ్యమైనంత వరకు క్షేత్రస్థాయిలో విధులు వేయకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన తర్వాత.. స్నానం చేసిన తర్వాతనే ఇంట్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రతి ఠాణాకు సంబంధించి కానిస్టేబుళ్లు, హోంగార్డుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఇన్​స్పెక్టర్​, ఏసీపీలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఠాణాలకు వచ్చే ఫిర్యాదుదారులు చేతులు శుభ్రపర్చుకోవడానికి శానిటైజర్ అందుబాటులో ఉంచారు.

నిర్విరామంగా కృషి చేస్తున్న పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పని విభజన చేయడంతో పాటు.. వారాంతపు సెలవులను ఉన్నతాధికారులు కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి: మిడతలదండు అంశంపై ముగిసిన సీఎం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.