ETV Bharat / state

కొవిడ్​ రోగులు బయటకొస్తున్నారు.. బీ కేర్ ఫుల్!

కరోనా వైరస్‌ బాధితులు బయట తిరిగేస్తున్నారు. కుటుంబ అవసరాలు.. ఇతర ముఖ్యమైన పనులు చేసుకోక తప్పని పరిస్థితుల్లో కొందరు అనివార్యంగా బయటకు వస్తున్నారు. కొందరికి రోగ నిర్ధారణ పరీక్షల కోసం పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రులకు వెళ్లిరావడం తప్పడం లేదు. మరికొందరు మాత్రం అవగాహన లేక, నిర్లక్ష్యంతోనూ ఇళ్ల నుంచి బయటకొస్తున్నారు.

corona-victims-roaming-outside
కొవిడ్​ రోగులు బయటకొస్తున్నారు.. బీ కేర్ ఫుల్!
author img

By

Published : May 16, 2021, 11:50 AM IST

కొవిడ్‌ సోకి ఇళ్లల్లోనే ఏకాంతంగా ఉండాల్సిన వారిలో కూడా కొందరు దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, సూపర్‌బజార్లకు వస్తున్నారు. ఇందులో కొందరు కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవడంతో వీరి నుంచీ కరోనా ఇతరులకు సోకే ముప్పు ఏర్పడుతోంది. అందువల్ల వ్యాధి బారిన పడని వారు కూడా బయటకి వెళ్లేప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండటం అవసరం.

ఆంధ్రప్రదేశ్​లోని ఒంగోలులో ఓ కుటుంబంలో ముగ్గురికి వైరస్‌ సోకింది. ఇందులో 30 ఏళ్ల వయసు ఉన్న కుమారుడు వైరస్‌ సోకిన తన తల్లిని తీసుకొని ఆసుపత్రికి వెళ్లి వస్తున్నాడు. తండ్రి కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు.

గుంటూరులోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉండే ఓ వ్యక్తికి వైరస్‌ సోకినప్పటికీ...రోజూ సాయంత్రం బయటకి వస్తున్నారు. ఇంటిపక్కన ఉన్న వారు ఎందుకు వస్తున్నావని అడిగితే వైద్యుడిని కలిసేందుకు వెళుతున్నానని సమాధానం ఇస్తున్నాడు.

పరిస్థితులు అనుకూలించక...!

కరోనా తొలిదశలో ఉన్నప్పుడు ఒకరికి వైరస్‌ సోకిన వెంటనే... ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి వారిని కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలకు తరలించేవారు. ఇంకొందరిని ఇళ్లల్లోనే కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ ప్రక్రియ అమలు జరగడంలేదు. వైరస్‌ సోకిన వారి వివరాలు చుట్టు పక్కల వారికి తెలియడంలేదు. వైరస్‌ బాధితులు సాధారణ వ్యక్తుల మాదిరిగానే బయటకు వస్తున్నారు. ఇంట్లో అందరికీ కనుక వైరస్‌ వస్తే... ఎవరో ఒకరు పనుల కోసం బయటకు రాక తప్పడంలేదు. ప్రత్యేకించి బంధువులు, స్నేహితుల సహకారం లభించని వారికి బయటకు రాక తప్పనిసరి పరిస్థితి నెలకొంటోంది.

నిర్లక్ష్యంగా కూడా...

ప్రకాశం జిల్లా చీరాలలో వైరస్‌ సోకిన వ్యక్తి బయట తిరుగుతుండటంతో స్థానికులు గుర్తించి మందలించి ఇంటికి పంపించారు. ఓ వ్యక్తి ఏకంగా సెలూన్‌కు వెళ్లి క్షవరం చేయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన వారు ఆందోళన చెందారు. కర్ఫ్యూ సమయంలో బయట తిరిగే వారిని గుంటూరులో విచారించగా వైరస్‌ సోకినందున వైద్యులను కలుసుకునేందుకు ఆసుపత్రులకు వెళ్లి వస్తున్నామని అనేక మంది చెప్పడం గమనార్హం. విజయవాడకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ముగ్గురికి వైరస్‌ సోకింది. వైద్యులను సంప్రదించేందుకు, ఇంటి అవసరాల కోసం రోజు మొత్తమ్మీద ఒకటి, రెండుసార్లు బయటకి వస్తున్నట్లు తెలిసింది.

కనిపించని ప్రత్యేక ఏర్పాట్లు!

బాధితులతో ప్రైవేట్‌ ల్యాబ్‌లు, కొవిడ్‌ పరీక్షా కేంద్రాలు, వ్యాక్సిన్‌ కేంద్రాలు, ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఆయా ఆవరణల్లో కొవిడ్‌ రోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కనిపించడంలేదు.

సహకారం తీసుకోవాలి..

* బాధితులు అవసరమైన వస్తువులను సాధ్యమైనంత మేర ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యమివ్వాలి.

* వైరస్‌ సోకిన వారికి స్థానికుల నుంచి సహకారం లభించే ధోరణి క్రమేణ పెరుగుతోంది. చుట్టుపక్కల వారి సహకారం పొందాలి.

* సొంత వాహనాల ద్వారా ఆసుపత్రులకు వెళ్లి వచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.

* టెలీ కన్సల్టెన్సీ ద్వారా వైద్యుల సలహాలు పొందొచ్చు. పట్టణాలు, నగరాల్లో ఈ సదుపాయం పెరుగుతోంది. మందులను ఆన్‌లైన్‌ ద్వారా తెప్పించుకోవచ్చు.

* బయటకు వెళ్లాల్సి వస్తే..బాధితులు మాస్కులు ధరించడం, ఎడం పాటించడం తప్పనిసరి. గుంపుల్లో కలిసిపోకుండా జాగ్రత్త పడాలి.

ఇదీ చదవండి: హైదరాబాద్‌ చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.