హైదరాబాద్‌లో నాలుగు సెంటర్లలో రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్వేత మహంతి తెలిపారు. జంట నగరాల్లోని 3 ప్రభుత్వ, ఒక ప్రైవేటు ఆస్పత్రిలో డ్రైరన్ చేయనున్నారు. గాంధీ ఆస్పత్రి, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్‌నగర్ యూపీహెచ్సీ, సోమాజిగూడ యశోద ఆసుపత్రిల్లో డ్రైరన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
వ్యాక్సిన్ డ్రైరన్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ శ్వేత మహంతి పాల్గొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ విధానం, పేర్ల నమోదు, వ్యాక్సినేషన్ సెంటర్లని గుర్తించడం, వ్యాక్సినేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల చర్చించారు.
ఇదీ చదవండి: కొవిడ్ వాక్సిన్ డ్రైరన్ కోసం ఏర్పాట్లు పూర్తి