గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా మరో 34 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో నలుగురు చికిత్స పొందుతూ గాంధీలో మృతి చెందారని మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో ఇద్దరు సంతోష్‌నగర్ సర్కిల్‌కు చెందిన వారు. కుర్మగూడ బస్తీకి చెందిన 78 ఏళ్ల వృద్ధుడిని శనివారం కరోనా లక్షణాలతో గాంధికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈది బజార్‌కు చెందిన 39 ఏళ్ల మహిళను కరోనా లక్షణాలతో రెండు రోజుల కిందట గాంధీకి తరలించగా సోమవారం రాత్రి మృతి చెందినట్లు మాదన్నపేట పోలీసులు ధ్రువీకరించారు. మిగతా ఇద్దరి వివరాలను అధికారులు వెల్లడించలేదు. మృతి చెందిన వృద్ధుడు, మహిళకు గతంలోనూ తీవ్ర అనారోగ్య సమస్యలున్నట్లు తెలుస్తోంది.
శంకర్‌నగర్‌లో 8 మందికి...
ఓల్డ్ మలక్‌పేట డివిజన్ శంకర్‌నగర్‌లో ఎనిమిది మందికి కరోనా సోకింది. మూడు రోజుల క్రితం ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(30)కి కరోనా వచ్చింది. అతని ద్వారా భార్యకు, సోదరుడికి, సోదరుడి భార్యకు, చెల్లెలికి, ఆమె భర్తకు, ముగ్గురు పిల్లలకు పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. జియాగూడ సులేమాన్‌జా మక్బరా ప్రాంతానికి చెందిన ఓ యువకుడి (28)కి మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పరిస్థితులను బేరీజు వేసేందుకు బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు సూచనలు చేశారు.
కువైట్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా...
కువైట్ నుంచి వచ్చి కాచిగూడలోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంటున్న తిరుపతికి చెందిన వ్యక్తి (31)కి కరోనా నిర్ధారణ కావడంతో గాంధీకి తరలించారు. గోల్నాక అశోకనగర్‌లో ఉండే సేల్స్‌మెన్ (39)తోపాటు అతని కుటుంబంలోని నలుగురికి కరోనా సోకిన విషయం విధితమే. మంగళవారం సేల్స్‌మెన్ భార్య(36)కు పాజిటివ్ వచ్చింది. శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీకి చెందిన మరో వ్యక్తికి (61)కి కరోనా సోకింది.
ముంబయిలో ఉంటున్న సదరు వ్యక్తి ఇటీవల కాలనీలో ఉంటున్న తమ్ముడి వద్దకు రాగా ఆయనకి అధికారులు కరోనా పరీక్షలు చేయించడం వల్ల మంగళవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మణికొండ అలీజాపూర్‌లో గత ఆదివారం ఓ మహిళకు పాజిటివ్ రాగా, మరో ఐదుగురు కుటుంబసభ్యులను కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించి పరీక్షించగా నలుగురికి పాజిటివ్ అని తేలింది.
బాలింతకు కరోనా...
జహనుమా డివిజన్‌లో ఓ బాలింతకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ నెల మొదటి వారంలో ఆమెకు సిజేరియన్ చేశారు. అప్పటికే ఆమె కరోనా లక్షణాలున్నాయి. పరీక్షలు చేయగా పాజిటివ్ నిర్ధారణ కావటం వల్ల గాంధీ ఆస్పత్రికి తరలించారు.
హస్తినాపురం డివిజన్ ధాతునగర్ కాలనీకి ఓ చెందిన ఓ మహిళకు కరోనా నిర్ధారణ కావడం వల్ల గాంధీ ఆసుపత్రికి తరలించినట్లుగా ఎల్బీనగర్ ఏఎంహెచ్‌ఓ మంజులవాణి తెలిపారు. మంగళ్‌హాట్ జాలీహనుమాన్ ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తి(38)కి అనుమానిత లక్షణాలు ఉండడంతో కింగ్‌కోఠిలోని ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. కరోనా పరీక్షలు నిర్వహించారు. అతనికి పాజిటివ్ నిర్ధారణ కావడం వల్ల గాంధీకి తరలించారు.