రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షల కిట్లకు కొరత ఏర్పడింది. గురువారం 80 వేల మందికి మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చాలా మంది ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. గత వారం రోజులుగా రోజుకు లక్ష నుంచి 1.2 లక్షల మధ్యలో పరీక్షలు నిర్వహిస్తుండగా.. గురువారం తక్కువ సంఖ్యకే పరిమితమైంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. శుక్రవారం నుంచి సాధారణంగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లు సమకూర్చుతోంది.
రెండ్రోజులుగా నల్గొండలో జిల్లాలో టెస్టుల్లేవ్..
నల్గొండ జిల్లాలో రెండు రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. పరీక్ష కిట్ల కొరతే ఇందుకు కారణం. జిల్లా వ్యాప్తంగా ఇటీవలి వరకు రోజుకు 4 వేల పరీక్షలు నిర్వహించారు. తాజాగా పరీక్షలు నిలిచిపోయాయి. ఇక్కడి పరిస్థితిని రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కొండల్‌రావు తెలిపారు.
ఇదీ చదవండి: వైరస్ మృత్యుఘంటికలు- ఆక్సిజన్ అందక విలవిల