ETV Bharat / state

పరీక్షలకు బ్రేకులు.. చెబుతున్నారు సాకులు

author img

By

Published : Sep 7, 2020, 10:44 AM IST

కరోనా రోజురోజుకీ విజృంభిస్తున్న వేళ మెరుగుపడాల్సిన సేవలు మరింత తగ్గిపోతున్నాయి. హైదరాబాద్‌లో 97, రంగారెడ్డి 60, మేడ్చల్‌ జిల్లాలో 88 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు యంత్రాంగం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం. చాలా వరకు ప్రభుత్వ కేంద్రాల్లో పరీక్షలు దాదాపు నిలిచిపోగా, బస్తీ దవాఖానాల్లో ఆ ఊసే లేదు.

corona tests are stopped in government hospitals in Telangana
ప్రభుత్వాసుపత్రుల్లో నిలిచిపోయిన కరోనా పరీక్షలు

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని షాపూర్‌నగర్‌, గాజులరామారం, కుత్బుల్లాపూర్‌, సూరారం పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలలో రోజుకు 25 కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. ఇక సిబ్బంది కొరతతో దుండిగల్‌, నిజాంపేటలలో రోజుకోచోట నిర్వహిస్తున్నారు. వీటి పరిధిలో ఆరు బస్తీ దవాఖానాలు ఉన్నాయి. నందానగర్‌, అంబేడ్కర్‌నగర్‌లో గర్భిణులకు మాత్రమే పరీక్షలు కొనసాగుతుండగా.. శ్రీకృష్ణనగర్‌, శివాలయనగర్‌, సుభాష్‌నగర్‌, భగత్‌సింగ్‌నగర్‌లో మొత్తం ప్రక్రియే నిలిపివేశారు.

జూబ్లీహిల్స్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రైవేటు భవనంలో కొనసాగుతోంది. ఇక్కడ స్థానికులు ఒప్పుకోవడం లేదని చెబుతూ వెంకటగిరి బస్తీ దవాఖానాలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే నియోజకవర్గ పరిధి ఫాతిమానగర్‌ పీహెచ్‌సీలో పరీక్షలు చేస్తుండగా శ్రీరామ్‌నగర్‌ యూపీహెచ్‌సీలో చేయట్లేదు. పరీక్షల సంఖ్య తగ్గించడంతో అనుమానితులు ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళ్లాల్సి వస్తోంది.

మల్లాపూర్‌ యూపీహెచ్‌సీలో ఓపీ పేరిట మంగళ, గురువారాల్లో మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల 100-130 మంది అనుమానితులు బారులు తీరగా 68 మందికే పరీక్షలు చేశారు. ఈ యూపీహెచ్‌సీ పరిధిలోని అశోక్‌నగర్‌, మర్రిగూడ, రాజీవ్‌నగర్‌, ఎస్‌వీనగర్‌, సింగంచెరువు తండా, ఎర్రకుంట బస్తీ దవాఖానాల్లో గతంలో పరీక్షలు చేసేవారు. కాలనీ సంఘాల అభ్యంతరం పేరిట పది రోజులుగా నిలిపివేశారు. తామేం అభ్యంతరం చెప్పట్లేదని సంఘాలు చెబుతుండగా, ఓపీ సమయం పెరగడంతో ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో ఆపినట్లు సిబ్బంది స్పష్టం చేస్తున్నారు.

కరోనా రోజురోజుకీ విజృంభిస్తున్న వేళ మెరుగుపడాల్సిన సేవలు మరింత తగ్గిపోతున్నాయి. హైదరాబాద్‌లో 97, రంగారెడ్డి 60, మేడ్చల్‌ జిల్లాలో 88 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు యంత్రాంగం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం. చాలా వరకు ప్రభుత్వ కేంద్రాల్లో పరీక్షలు దాదాపు నిలిచిపోగా, బస్తీ దవాఖానాల్లో ఆ ఊసే లేదు. డ్యూటీ సమయం పెంచారంటూ బస్తీ దవాఖానాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేసేందుకు సిబ్బంది సహాయ నిరాకరణ చేస్తున్నారు. దీంతో ఆయా కేంద్రాల్లో సగానికిపైగా పరీక్షలు తగ్గిపోయాయి. కొన్నిచోట్ల సిబ్బంది, కిట్ల కొరత ఉంది.

కొనసాగుతున్నాయి

కరోనా నిర్ధారణ పరీక్షలు ఆపమని ఏ కేంద్రానికీ ఆదేశాలు ఇవ్వలేదు. గర్భిణులు, పిల్లలకు టీకాలు, వైద్యసేవలు అందించే చోట మాత్రమే పరిస్థితిని బట్టి ఆపేస్తున్నాం. ఆ కేంద్రాల్లో కూడా ప్రత్యేక కౌంటర్‌ ద్వారా పరిమిత సంఖ్యలో పరీక్షలు చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. నిర్లక్ష్యంగా ఆపేస్తే చర్యలు తీసుకుంటాం.- వీరాంజనేయులు, మేడ్చల్‌ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి.

కాలనీ సంఘాలు అడ్డు కాదు

మా కాలనీల్లో స్థానికులు అభ్యంతరం చెప్పారని..కరోనా నిర్ధారణ పరీక్షలు ఆపినట్లు చెప్పడం సరికాదు. ఎవరూ అడ్డు చెప్పలేదు. ఆ సాకుతో గత 20 రోజులుగా పరీక్షలు మానేశారు. స్థానికంగా మావంతు సహకారం అందిస్తాం. కరోనా అనుమానితులు పెరుగుతున్న దృష్ట్యా పరీక్షల సంఖ్య పెంచాలి. - రంగు మల్లికార్జున్‌, అశోక్‌నగర్‌ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు.

ఒక్కోచోట ఒక్కోలా

  • ప్రభుత్వ కేంద్రాల్లో రకరకాల నిబంధనలు నడుస్తున్నాయి. కొన్నిచోట్ల కేవలం గర్భిణులకే కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. ఇంకొన్నిచోట్ల వారానికి రెండు రోజులే. చేసిన రోజూ పరిమితమే. దీంతో అనుమానితులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు కేంద్రాల బాట పడుతున్నారు.
  • గ్రేటర్‌ పరిధిలోని కరోనా పరీక్ష కేంద్రాల్లో ఇప్పటికే సిబ్బంది కొరత ఉంది. దానికి తోడు ఇటీవల కొత్తగా ఏర్పాటైన బస్తీ దవాఖానాలకు సర్దుబాటు చేయడంతో సిబ్బంది సంఖ్య తగ్గుతూ వస్తోంది.
  • ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరత ఉన్న చోట స్టాఫ్‌ నర్సులు, వైద్యులతో తక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారు.
  • బస్తీ దవాఖానాల్లో పిల్లలకు టీకాలు, గర్భిణిలకు సేవలందించడంతో పాటు పరిమితంగానైనా కొవిడ్‌ పరీక్షలు చేయాలని ఆదేశాలున్నా సిబ్బంది కొరతతో అమలు కావడం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.