కరోనా మహమ్మారి నివారణకు రచయితలు తమ గళం విప్పుతున్నారు. ఎంత చెప్పినా వినకుండా... నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్న జనాలను బయటకు వెళ్లొద్దంటూ వేడుకుంటున్నారు. అన్నలారా... తమ్ముల్లారా జర వినండి.. నీకు దండం పెడుతారా అంటూ గేయాన్ని ఆలపించారు. కరోనాను కట్టడి చేయాలంటే మనిషికి మనిషికి దూరం పరిశుభ్రత అవసరం అంటూ పాడారు. ఈ క్రమంలో కరోనా వైరస్ నివారణకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని గళం విప్పారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారి నుంచి మానవాళి క్షేమంగా బయటపడాలంటే బయటకు రాకండని శేఖర్ పగిళ్ళ పాట రూపంలో సూచించారు. దయచేసి ఇల్లు వదిలి ఎవరూ బయటకు రావొద్దని వేడుకున్నారు.
ఇవీ చూడండి : మాస్కు ఎవరు వాడాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?