ETV Bharat / state

గ్రేటర్​ హైదరాబాద్​లో కరోనా పంజా - Corona Positive Cases Latest News

గ్రేట‌ర్ హైద‌రాబాద్ పరిధిలో ప్రతి రోజు వేల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు వచ్చి చేరుతున్నాయి. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రులూ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి లేకపోవటం వల్ల వేల సంఖ్యలో పాజిటివ్​గా నిర్థరణ అయిన వారు ఇళ్లలోనే ఉండి చికిత్స పొందుతున్నారు.

గ్రేటర్​ హైదరాబాద్​లో కరోనా పంజా
గ్రేటర్​ హైదరాబాద్​లో కరోనా పంజా
author img

By

Published : Jul 6, 2020, 8:05 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మహానగర పరిధిలో క‌రోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్యులు... ఫోన్లలోనే రోగులకు సూచనలు ఇస్తున్నారు. ఫలితంగా క్రమేపీ ఆయా సలహాలు పాటిస్తూ వ్యాధి నుంచి కోలుకుంటున్నారు. ఈ దుస్థితిని గమనించిన జంట నగర వాసులు ఎక్కువగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. కొత్తగా వేల సంఖ్యలో కేసులు నమోదుతో పాటు మృతుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతుండటం ప్రజలతో సహా అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ప్రస్తుతం కరోనా విస్తరించింది.

బడంగ్​పేట మేయర్​కూ కొవిడ్

సొమవారం బల్దియా పరిధిలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. మల్కాజిగిరి డివిజన్ మారుతీనగర్​కు చెందిన మ‌హిళ... గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. బడంగ్‌పేట్ మేయర్​కు కరోనా పాజిటివ్ సోకింది. యూసుఫ్ గూడ సర్కిల్-19 పరిధిలో 33 మందికి కరోనా పాజిటివ్ నిర్థరణ అయిన‌ట్లు అధికారులు వెల్లడించారు. కూకట్‌పల్లిలో‌ మొత్తం 60 కరోనా కేసులను గుర్తించారు. మూసాపేట్ సర్కిల్​లో 46, కూకట్‌పల్లి సర్కిల్​లో 14 కేసులు నమోదు అయిన‌ట్లు అధికారులు ప్రకటించారు. సోమవారం నుంచి చార్మినార్, గోల్కొండ కోట‌లోకి సందర్శకులకు అనుమతి ఇచ్చినట్లు తెలిపిన ఆర్కియాలజీ విభాగం ఆ త‌ర్వాత అనుమతిని రద్దు చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్​లో ఉన్నందున సందర్శకులకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

గ్రేటర్​ హైదరాబాద్​లో కరోనా పంజా

ఇవీ చూడండి : పేదల విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.