ETV Bharat / state

బాబాయి, అబ్బాయితో మొదలై... ఇలా విజృంభిస్తోంది

భాగ్యనగరంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. మంగళవారం 37 కేసులు నమోదయ్యాయి. అలాగే మరో ఇద్దరు కొవిడ్​-19తో మృతి చెందారు.

Hyderabad corona latest news
Hyderabad corona latest news
author img

By

Published : May 13, 2020, 7:52 AM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని జియాగూడ డివిజన్‌లో చాపకింద నీరులా రోజుల వ్యవధిలోనే వైరస్‌ విస్తరించినట్టు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. జియాగూడలో సోమవారం ఒకేరోజు 25 పాజిటివ్‌ కేసులు గుబులు పుట్టించాయి. మార్చి నుంచి ఇప్పటి వరకూ జియాగూడ డివిజన్‌లో 68 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృత్యువాత పడ్డారు. 8 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

అసలు కారణాలు ఇవేనా..?

జియాగూడ డివిజన్‌లో నివసించే బాబాయి-అబ్బాయి ఫర్నిచర్‌ తయారు చేస్తుంటారు. మార్చిలో బంధువుల పెళ్లికి ఉత్తరప్రదేశ్‌ వెళ్లి.... తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో నగరానికి వచ్చారు. మార్చి రెండోవారంలో బాబాయి జలుబు, దగ్గుతో ఇబ్బంది పడ్డాడు. ఆ తరువాత అబ్బాయి కూడా అనారోగ్యానికి గురయ్యాడు. ఇద్దరికి వైద్య పరీక్షలు చేసి కరోనా సోకినట్టు గుర్తించారు. చికిత్స అనంతరం కోలుకున్న ఇద్దరూ గృహ నిర్బంధంలో ఉన్నారు.

ఇదే ప్రాంతంలోని ఓ తల్లి, చిన్న కుమారుడు ఆగ్రా వెళ్లారు. తర్వాత దిల్లీ వెళ్లి మర్కజ్‌ యాత్రికులతో కలిసి నగరం చేరారు. కొద్దిరోజులకు ఆ కుటుంబంలోని రెండో కుమారుడిలో వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి. కుటుంబంలోని 9 మంది కొవిడ్‌-19 బారిన పడ్డారు.

కిటకిటతో కట్టడి ఎలా..?

జియాగూడ-కార్వాన్‌ ప్రాంతాలు మాంసం దుకాణాలు, జంతు విక్రయాలు, కూరగాయల మార్కెట్‌తో నిత్యం కిటకిటలాడుతుంటాయి. లాక్‌డౌన్‌ సమయంలోనూ పోలీసుల కన్నుగప్పి ఆకతాయిలు యథేచ్ఛగా తిరిగేవారు. రోజువారీ సంపాదనపై ఆధారపడిన కుటుంబాలే ఎక్కువ.

ఈ ప్రాంతంలో మరణించిన ఆరుగురు వ్యక్తుల్లో మధుమేహం, అధిక రక్తపోటు, గుండె, శ్వాసకోశ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నవారే ఉన్నారు. డివిజన్‌లో వైరస్‌తో మరణించిన మహిళ దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడేది. మరో వ్యాపారి కూడా ఇదే సమస్యతో ఆసుపత్రికి చేరి చికిత్స పొందుతూ మరణించాడు. మరో వృద్ధుడు డయాలసిస్‌తో కాలం వెళ్లదీస్తున్నాడు.

గ్రేటర్‌లో తాజాగా 37 కేసులు...

గ్రేటర్‌లో మంగళవారం 37 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. జియాగూడలో ఇద్దరు కరోనాతో మృతిచెందారు. వీరిలో ఒకరు ఇందిరానగర్‌లో ఉంటున్న ఓ పార్టీ నాయకుడు, ప్లాస్టిక్‌ వ్యాపారి (68) కాగా మరొకరు యువతి (36). సంజయ్‌నగర్‌లో ఉంటున్న ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కుల్సుంపురా సీఐ పి.శంకర్‌ తెలిపారు.

మాదన్నపేటలో 11 నెలల చిన్నారికి...

మాదన్నపేటలో ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న చిన్నారి తండ్రికి కరోనా రావడం వల్ల గాంధీకి తరలించారు. ఏడుగురు కుటుంబ సభ్యులను పరీక్షించగా వారిలో 11 నెలల చిన్నారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

మూసాపేట్‌ సర్కిల్‌ అల్లాపూర్‌ డివిజన్‌ రాజీవ్‌ గాంధీనగర్‌లో మరో ఇద్దరికి, పంచశీలకాలనీలో ఓ ప్రైవేటు ఉద్యోగికి, ముషీరాబాద్‌లో ఉంటూ కాచిగూడలో ఓ మార్ట్‌లో పనిచేసే వ్యక్తి (38)కి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో భార్యాభర్తలకు పాజిటివ్‌ వచ్చినట్లు కమిషనర్‌ బి.సుమన్‌రావు తెలిపారు. భార్య జీహెచ్‌ఎంసీకి చెందిన ఓ సర్కిల్‌లో స్వీపర్‌ కాగా ఆమెను నిత్యం భర్త ద్విచక్రవాహనంపై ఇంటికి తీసుకు వస్తుంటారు. దీంతో ఆయనకూ కరోనా సోకింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.