ETV Bharat / state

అమ్మో కరోనా.. మేడ్చల్​లోని పలు ప్రాంతాల్లో పటిష్ట భద్రత - latest news of medchal

మేడ్చల్​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు నిర్ధరణ కావడం వల్ల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. వైరస్​ పాజిటివ్​ తేలిన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ప్రజలెవరూ బయటకు రాకుండా తగిన సూచనలు చేశారు.

corona-places-in-medchal-district-are-in-tight-security
కరోనా కారణంగా పటిష్ట భద్రత నడుమ మేడ్చల్​లోని పలు ప్రాంతాలు
author img

By

Published : Jun 30, 2020, 6:01 PM IST

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి, కుషాయిగూడ, నాగారం, చిర్యాల, కీసరలో కరోనా కేసులు నిర్ధరణ కావడం వల్ల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు.

కరోనా వచ్చిన వారి ఇంటి ముందు బారిగేడ్లు, కట్టెలు పెడుతున్నారు. మాస్కులు లేకుండా తిరిగితే జరిమానాలు విధిస్తున్నారు. కీసర మండల కేంద్రంలో ఒక ఆసుపత్రిలో ఒక వ్యక్తికి కరోనా నిర్ధరణ కావడం వల్ల అక్కడి ప్రజలు ఉలిక్కిపడ్డారు.

మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మరో వైపు జిల్లా కలెక్టరేట్​లో కూడా కరోనా నిర్ధరణ కావడం వల్ల అధికారులు భయపడిపోతున్నారు.

ఆ ప్రాంతానికి ఎవ్వరు రాకుండా 3 రోజులపాటు నిషేధం విధించారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.