ETV Bharat / state

ఏపీలో కరోనా కష్టాలు... పడకలు దొరక్క రోగుల ఇక్కట్లు !

ఏపీలో కరోనా విశ్వరూపం చూపుతోంది. కొన్ని జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య పెరగడం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆస్పత్రుల్లో పడకల కొరత, కొవిడ్‌ పరీక్షా ఫలితాల్లో జాప్యం.. బాధితుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి నివారణకు మూడో రోజూ కర్ఫ్యూను కట్టుదిట్టంగా పోలీసులు అమలు చేశారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు.

corona-patients-struggle-over-oxygen-beds
ఏపీలో కరోనా కష్టాలు...పడకలు దొరక్క రోగుల ఇక్కట్లు !
author img

By

Published : May 8, 2021, 9:33 AM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో లక్షా 424 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 17,188 మందికి పాజిటివ్ వచ్చింది. వైరస్‌తో మరో 73 మంది మరణించారు. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 11 మంది చనిపోయారు. విశాఖలో 10, తూర్పుగోదావరి జిల్లాలో 8, చిత్తూరు జిల్లాలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున మరణించారు. పశ్చిమగోదావరి, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున... నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు.. అనంతపురంలో ఇద్దరు చొప్పున ప్రాణాలు విడిచారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,260 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,86,695 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఏపీలో కరోనా కష్టాలు... పడకలు దొరక్క రోగుల ఇక్కట్లు !

అధికారులకు కరోనా...

విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌ కొవిడ్‌ బారినపడ్డారు. జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన, సంయుక్త కలెక్టర్లు సహా పలువురు అధికారులు కరోనాతో బాధపడుతుండటంతో... ఇంటి వద్ద నుంచే సమీక్షలు, విధులు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలో ఓ న్యూస్‌ఛానెల్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్న మారుతిరెడ్డి.. కరోనాతో పోరాడి ప్రాణం వదిలారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న అనిత... చికిత్స పొందుతూ మరణించారు. కడప జిల్లా మైదుకూరులో బిచ్చగాడు మృతదేహానికి.. వివేకానంద ఫౌండేషన్‌ అంత్యక్రియలు నిర్వహించింది. గుంటూరు జిల్లా నండూరులో కరోనాతో మృతిచెందిన వ్యక్తికి...పొన్నూరు ముస్లిం యూత్‌ సభ్యులు.. హిందూ సంప్రదాయపద్ధతిలో అంతిమసంస్కారాలు పూర్తిచేశారు.

నేలపైనే చికిత్స

కాకినాడ జీజీహెచ్​లో పడకల కొరతతో నేలపైనే రోగులకు చికిత్స చేశారు. కడప జిల్లాలోనూ పడకల కొరత వేధిస్తోంది. రోజుకు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నా...పడకల సంఖ్య పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా సర్వజన వైద్యశాలలో పడకల కొరతతో కొంత మందిని నేలపై పడుకోబెట్టి వైద్యం చేశారు. కల్యాణదుర్గంలో అన్ని పడకలకూ ఒకే ఆక్సిజన్‌ యంత్రం ఉన్నందున...ప్రాణవాయువు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధితులు వాపోయారు.

విజిలెన్స్ దాడులు

కొవిడ్‌ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. అనంతపురంలో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఓ ప్రైవేటు ఆసుపత్రిపై దాడులుచేసిన విజిలెన్స్‌ అధికారులు... కేసులు నమోదు చేశారు. కరోనా విధుల సమన్వయంలో విఫలమయ్యారనే ఆరోపణతో... హిందూపురం ఆసుపత్రి నోడల్‌ అధికారి వి.రాజేంద్రప్రసాద్‌ను సస్పెండ్‌ చేశారు. ఆయన స్థానంలో పెనుకొండ సబ్ కలెక్టర్ నిశాంతిని నోడల్‌ అధికారిగా నియమించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రైవేటు ఆసుపత్రుల్లో...సబ్‌కలెక్టర్‌ కల్పన కుమారి ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి... అభిజ్ఞ ఫౌండేషన్ అధినేత పవన్ కుమార్ రెడ్డి మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేశారు. విశాఖలో కరోనా రోగులకు అందుతున్న చికిత్సల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న భాజపా నేతలు... రోగులకు అవసరమైన ఇంజెక్షన్లు అందించారు.

పకడ్బందీగా కర్ఫ్యూ అమలు

వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ కఠినంగా అమలవుతోంది. రహదారులన్నీ నిర్మానుష్యమయ్యాయి. బయటకు వచ్చిన వాహనదారులకు పలుచోట్ల పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయట తిరిగేవారి వాహనాలు సీజ్‌ చేస్తే కోర్టు ద్వారానే విడిపించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో ఆంక్షలు ఉల్లంఘించిన దాదాపు లక్ష మందికిపైగా కేసులు నమోదు చేశారు.

ఇదీచదవండి: కొత్త వారికి ఇప్పట్లో టీకా ఇవ్వలేం: అనిల్ సింఘాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.