ETV Bharat / state

లాక్‌డౌన్‌ వల్లే కరోనా ఆగింది : ముఖ్యమంత్రి కేసీఆర్​ - లాక్​డౌన్​పై సీఎం కేసీఆర్​ తాజా వార్తలు

తెలంగాణలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి పకడ్బందీగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ప్రజలు ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ కోరారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిత్యావసరాలైన పాలు, పండ్లు, కూరగాయలు, ఔషధాలు, మాంసం తదితర విక్రయాలు యథావిధిగా జరగాలన్నారు. రేషన్‌ కార్డున్న ప్రతి కుటుంబ బ్యాంకు అకౌంటులో రూ.1500 చొప్పున నగదు వేసే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైందని.. అందరికీ డబ్బులు చేరతాయని తెలిపారు. గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కేంద్రాలను చక్కగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులు చెప్పిన సమయానికే వచ్చి, తమ ధాన్యం అమ్ముకొని పోవాలన్నారు. పట్టణ ప్రాంతాలు, ఇతర చోట్ల వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను, సహాయ కార్యక్రమాలను అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

Corona not expanding on lockdown: cm kcr
లాక్‌డౌన్‌ వల్లే కరోనా విస్తరించడం లేదు: ముఖ్యమంత్రి కేసీఆర్​
author img

By

Published : Apr 11, 2020, 6:02 AM IST

దేశంలో, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా నిర్వహించడం వల్లే వైరస్‌ ఇతర దేశాల మాదిరిగా ఎక్కువగా విస్తరించడం లేదనే సత్యాన్ని ప్రజలంతా గ్రహించి, పూర్తిగా సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. వైరస్‌ సోకిన వారిని గుర్తించి సత్వర చికిత్స అందించడం, వ్యాధిగ్రస్తులను కలిసిన వారిని గుర్తించి క్వారంటైన్‌ చేయడం వంటివి క్రమం తప్పకుండా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని చెప్పారు.

వరికోతలు, ధాన్యం ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా జరపాలని సూచించారు. రాష్ట్రంలో నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలన్నారు. కరోనాపై ఆయన శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్‌.నర్సింగ్‌రావు, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

వైరస్‌ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే దృశ్యమాధ్యమ సమీక్ష, ప్రస్తావించాల్సిన అంశాలు, మధ్యాహ్నం జరిగే మంత్రిమండలి సమావేశంలో చర్చించాల్సిన విషయాల గురించి కూడా సమాలోచనలు జరిపారు.

చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి..

కరోనా వైరస్‌ లక్షణాలున్న వారికి పరీక్షలు జరుపుతున్నామని, శుక్రవారం కొత్తగా 16 మందికి పాజిటివ్‌ వచ్చిందని, వారికి చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వారి కుటుంబసభ్యులు, వైరస్ సోకిన వారిని కలిసిన వారిని కూడా గుర్తించి క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. పాజిటివ్‌ కేసులు ఎక్కువైనప్పటికీ.. అందరికీ చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వెల్లడించారు.

వ్యక్తిగత దూరం పాటించి.. బియ్యం పొందాలి..

దుకాణాల వద్ద జనం గుమిగూడకుండా దూరం పాటించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రేషన్‌ షాపుల ద్వారా నియంత్రిత పద్ధతిలో జరుగుతున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు. చెప్పిన సమయానికి వచ్చి, వ్యక్తిగత దూరం పాటించి బియ్యం పొందాలన్నారు.

ఇదీ చూడండి: ఆ 2 విషయాల వల్లే అమెరికాలో కరోనా చిచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.