కరోనా వైరస్ సోకకుండా ఔషధాలు ఉన్నాయంటూ ఆన్‌లైన్‌లో నకిలీ మందులు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ కేంద్రంగా
బత్తిని ఆయుర్వేదం పేరుతో ఆ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... రంగంలోకి దిగి నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి లక్ష రూపాయల విలువైన నకిలీ ఔషధాలు స్వాధీనం చేసుకున్నారు.
కరోనా వైరస్, లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఈ తరహా ముఠాల బారినపడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీవివాస్‌తో మా ఈటీవీ భారత్ ప్రతినిధి కె.శ్రీనివాస్ ముఖాముఖి.
ఇదీ చూడండి : మనమరాలికి కిడ్నీ సమస్య..యాచకుడిగా మారిన తాత