ETV Bharat / state

బండి నడిచేదెప్పడు.. బతుకు పోరులో గెలిచేదెప్పుడు..?

author img

By

Published : Nov 8, 2020, 7:02 PM IST

కరోనా లాక్​నౌడ్​తో జనజీవనం స్తంభించింది. కొన్ని రోజులు పాటు ప్రపంచ జనాభా అన్నీ విడిచిపెట్టి ఇంటికే పరిమితమయ్యారు. ఎక్కడి వారు అక్కడే గప్​చుప్ అన్నట్లు ప్రయాణ ప్రాంగణాలు మూతపడ్డాయి. ఎంతో మంది బతుకులు తారుమారయ్యాయి. బీద, ధనిక అనే తేడా లేకుండా విలవిల్లాడారు. అన్​లాక్​ ప్రక్రియ ప్రారంభం కావడం వల్ల ప్రస్తుతం కొంతమేర పరిస్థితి మెరుగైనప్పటికీ.. పూర్తి స్థాయిలో రైల్లు అందుబాటులోకి రాకపోవడం ప్రస్తుత పరిస్థితికి అందం పడుతుంది. ఇక రైల్వే స్టేషన్​లపై ఆధారపడి బతికే కూలీలు, చిరు వ్యాపారుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది.

corona-effects-on-railway-coolies-and-autowala
బండి నడిచేదెప్పడు.. బతుకు పోరులో గెలిచేదెప్పుడు..?

దేశవ్యాప్తంగా అన్​లాక్ ప్రారంభమైనా.. సాధారణ రైళ్లు మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. కరోనాతో మార్చి 22న నిలిచిపోయిన రైళ్లు.. ఇప్పటికి పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. దసరా, దీపావళి పండగలకు అయిన పూర్తి స్థాయిలో రైళ్లు నడుస్థాయని అశించినవారికి నిరాశే మిగిలింది. సరిపడ రైళ్లు లేక.. రైల్వే స్టేషన్​లకు వచ్చే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో నిరంతరం ప్రయాణికులతో కళకళ లాడే రైల్వే స్టేషన్ల ప్లాట్ ఫాంలు వెలవెలబోతున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే స్టేషన్ పరిసర ప్రాంతాలు బోసిపోయాయి. స్టేషన్లలో వ్యాపారాలు లేక దుకాణాలు మూతపడ్టాయి. ప్రయాణికులనే నమ్ముకుని జీవనం సాగించే వీరికి ఉపాధి కరవైంది.

కరోనాకు ముందు సాధారణ రోజుల్లో ఏపీ విజయవాడ రైల్వే స్టేషన్​లో రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండేవారు. భారీగా సరకు రవాణా జరుగుతుండేది. దీంతో ప్రయాణికుల లగేజీని రైలు ఎక్కించేందుకు, దించేందుకు లైసెన్స్ కల్గిన కూలీలను రైల్వే శాఖ నియమించింది. లగేజీ మోయగా వచ్చే కొద్దిపాటి కూలీతో వీరి జీవనం సాఫీగా గడిచిపోయేది. అయితే కరోనా రాకతో ప్రారంభమైన వీరి కష్టాలు నేటికి తీరడం లేదు. ఒకప్పుడు చేతి నిండా పనితో ఉండే వీరు.. ఇప్పడు మూడు రోజులకు ఒకసారి మాత్రమే పని దొరుకుతోంది. ఆరోజంతా పని చేస్తే మూడు వందలు కూడా రావడం గగనమైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా భయంతో చాలా మంది ప్రయాణికులు కూలీలకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు చెబుతున్నారు. రైల్వే అధికారులు కూడా ఎక్కువ లగేజీని అనుమతించకపోవడంతో కూలీల ఉపాధికి గండి పడుతోందని వాపోతున్నారు. గతంలో ఎక్కువ కాలం రైల్వే కూలీగా పనిచేసిన వారిని గ్యాంగ్ మెన్లుగా నియమించేవారని.. కొన్నేళ్లుగా దాన్ని అమలు చేయడం లేదంటున్నారు. ఉపాధి లేక కష్టాలు పడుతోన్న తమకు గ్యాంగ్ మెన్లుగా నైనా అవకాశం కల్పించాలని వీరు కోరుతున్నారు.

నిత్యం వేలాది మంది రాకపోకలు జరిపడం రైల్వే స్టేషన్ వాణిజ్య కేంద్రంగా మారింది. స్టేషన్లో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు విపరీతంగా పోటీ పడతారు. అద్దెగా లక్షలు వెచ్చించి దుకాణాలు ఏర్పాటు చేస్తారు. అలాంటిది కరోనా ప్రభావంతో రైళ్ల రాకపోకలు లేక.. 7 నెలలుగా చాలా దుకాణాలు మసేశారు. అక్కడక్కడ ఒకటి, రెండు దుకాణాలు తెరిచినా కొనేవారు రాక వెలవెల బోతున్నాయి.

రైల్వేస్టేషన్ పై ఆధారపడి వందలాది ఆటో వాలాలు, టాక్సీ డ్రైవర్లు, రిక్షావాలాలు జీవనం గడుపుతుంటారు. ప్రయాణికులు రాకపోకలు గణనీయంగా తగ్గడంతో వీరికి ఉపాధి కరువైంది. కరోనాకు భయపడి చాలా మంది సొంత వాహనాల్లో స్టేషన్లకు రాకపోకలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో రోజుకు వెయ్యి రూపాయల వరకు వచ్చే కిరాయి.. ఇప్పుడు రోజంతా చేసినా రెండు, మూడు వందలు కూడా రావడం లేదంటు వాపోతున్నారు. డీజిల్ ధరలు, సీఎన్​జీ ధరలు పెరుగుతున్న పరిస్ధితుల్లో వచ్చిన డబ్బులు వాహనాల ఖర్చులకే సరిపోవడం లేదంటున్నారు.

రైల్వే స్టేషన్ ఉందన్న ధీమాతో ఎక్కువ అద్దెలు చెల్లించి సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారి పరిస్ధితీ మరింత దారుణంగా మారింది. స్టేషన్లు, రైళ్లలో చిన్న పాటి చిరుతిళ్లు వ్యాపారాలు చేసుకునే కూలీలు ఎక్కడా కనిపించడం లేదు. సాధారణ రైళ్లు ఎప్పుడు తిరుగుతాయో.. తమ లాంటి వారికి ఎప్పుడు ఉపాధి దొరుకుతుందోనని రాష్ట్రంలో పలు రైల్వే స్టేషన్లలో పనిచేస్తోన్న శ్రామికులు, కూలీలు, వ్యాపారులు, ఆటోవాలాలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇవీ చూడండి: డోర్నకల్ రైల్వే స్టేషన్​లో డీఆర్​ఎం ఆకస్మిక తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.