ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: అయోమయంలో అంకుర సంస్థలు

author img

By

Published : Jun 27, 2020, 6:51 AM IST

కరోనా అన్ని రంగాలనూ కుదిపేస్తోంది. అంకుర సంస్థలపైనా దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఆదాయం తగ్గిపోవడం, నిర్వహణకు తగిన నిధులు లేకపోవడం వల్ల గత రెండేళ్లలో ఏర్పాటైన కొన్ని అంకురాల (స్టార్టప్‌ల) కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోగా.. మరికొన్ని మూసివేత దిశగా వెళ్తున్నాయి.

corona effect on start ups
కరోనా ఎఫెక్ట్​: అయోమయంలో అంకుర సంస్థలు

కరోనా మహమ్మారి ఎన్నో రంగాలను అతలాకుతలం చేసింది. అంకుర సంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. 70 శాతం అంకురాలకు మూడు నెలలకు మించి నిల్వలు లేకుండా పోయాయి. రవాణా, పర్యాటక, ఆర్థిక, వ్యవసాయ సాంకేతిక సేవల్లోని అంకుర సంస్థలు క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లాయి. వీటి పునరుజ్జీవం కోసం ప్రభుత్వాలు సహకారం అందించాలని సాఫ్ట్​వేర్‌, సేవా సంస్థల జాతీయ సమాఖ్య (నాస్కామ్‌) అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా 250 అంకుర సంస్థల పరిస్థితులపై ఈ సంస్థ నెల రోజుల పాటు సర్వే నిర్వహించింది. వీటిలో 78 శాతం అంకుర సంస్థలు రూ.కోటి లోపు ఆదాయం ఉన్నవే. కరోనా ప్రభావం వల్ల ప్రస్తుతం దాదాపు 50 శాతం అంకురాలకు సత్వరం ప్రభుత్వ సహాయం చేయాల్సిన అవసరమని నాస్కామ్‌ పేర్కొంది.

కరోనా నేపథ్యంలో కొన్ని అంకుర సంస్థలు వ్యాపార విధానాన్ని పునర్‌వ్యవస్థీకరించుకుంటున్నాయి. నాలుగేళ్లకు పైగా అనుభవమున్న సంస్థలు వినియోగ సేవలు, పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తులు సవరిస్తున్నాయి. నూతన భాగస్వామ్యాలు, మార్కెటింగ్‌, కొత్త అవకాశాలపై దృష్టిపెట్టడంతో పాటు ఆర్థిక వనరుల కోసం ప్రయత్నిస్తున్నాయి. దాదాపు 66 శాతం స్టార్టప్‌లు ఏడాదిలోగా కరోనా ప్రభావం తొలగిపోతుందన్న ఆశాభావంతో ఉన్నాయి. 40 శాతం సంస్థలు ఆరోగ్య రంగంలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని, 20 శాతం విద్య, ఆర్థిక రంగాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నాయి. కృత్రిమ మేధా, ఐవోటీ, బ్లాక్‌చైన్‌ రంగాల్లో సాంకేతిక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, డేటా మేనేజ్‌మెంట్‌, అనలటిక్స్‌, డిజిటల్‌ ఫైనాన్స్‌ రంగాల్లో రాణించేందుకు అవకాశాలున్నాయని వెల్లడైంది.

ఆదుకునేందుకు ఇలా చేయాలి..

  • ప్రభుత్వం గత రెండేళ్ల జీఎస్టీని రిఫండ్‌ చేయడంతో పాటు వచ్చే రెండేళ్ల పాటు విరామం ఇవ్వాలి.
  • ప్రభుత్వ టెండర్లలో కొన్నింటిని ప్రత్యేకంగా స్టార్టప్‌లకే కేటాయించాలి. తక్కువ ధరల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
  • దిగ్గజ ఐటీ కంపెనీలు స్టార్టప్‌లకు సబ్‌ కాంట్రాక్టులు ఇవ్వాలి. స్టార్టప్‌ల కోసమే కొన్ని టెండర్లు ఉండాలి.
  • ఆర్థిక సేవల స్టార్టప్‌లను బ్యాంకులు టెక్నాలజీ సంస్థల విభాగంలో గుర్తించాలి.
  • స్టార్టప్‌ వ్యవస్థాపకులు ఆస్తులపై రుణాలు పొందే అవకాశమివ్వాలి.

ఆదాయం తలకిందులు..

కరోనా వల్ల దాదాపు 92 శాతం అంకుర సంస్థల ఆదాయం పడిపోయింది. 34 శాతం సంస్థలు 80 శాతానికి పైగా ఆదాయం కోల్పోయాయి. మెట్రో నగరాల్లోని సంస్థలకు ఆదాయం 40 శాతం తగ్గిందని సర్వేలో వెల్లడైంది. కరోనా సమయంలో విద్య, వైద్య, ఆర్థిక సేవల రంగాల్లోని వాటి ఆదాయం మాత్రం పెరిగింది. అధిక ఆదాయం కలిగిన సంస్థల మనుగడకు ఢోకా లేకున్నా.. మిగతా వాటి పరిస్థితి కష్టంగా మారింది. వ్యాపార-వ్యాపార విధానంలోని సంస్థలకు క్లయింట్ల నుంచి చెల్లింపులు ఆలస్యం కావడం ప్రధాన అవరోధం అవుతోంది. వ్యాపార-వినియోగ విధానంలోని సంస్థలకు మానవ వనరుల కొరత నెలకొంది. కొన్నింటి ఆర్డర్లు రద్దవుతున్నాయి. ఆదాయం తగ్గడం వల్ల ప్రతి 4 సంస్థల్లో మూటిండిలో మనుగడ కోసం మార్కెటింగ్‌ ఖర్చులు తగ్గించి సిబ్బంది వేతనాల్లో కోతలు విధిస్తున్నాయి.

ఇదీచూడండి: రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 237కు చేరిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.