ETV Bharat / state

పెద్దలూ జాగ్రత్త..! పండుటాకులపై కరోనా పంజా.. - corona effect on old people

కరోనా మహమ్మారి ప్రభావం వృద్ధులపై అధికంగా కనిపిస్తోంది. వైరస్​ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వృద్ధులను, పదేళ్లలోపు చిన్నారులను ఇళ్లకే పరిమితం చేయాలని, దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్న వారిని మరీ జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు.

corona effect on people above 50 years
50 ఏళ్లు పైబడినవారికే కరోనా ముప్పు అధికం
author img

By

Published : Jun 3, 2020, 8:03 AM IST

భాగ్యనగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జూన్‌ 1 వరకు 1,600కుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్‌కు చెందిన 64 మంది వృద్ధులు చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. 900 మందికిపైగా వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 650 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు ఉన్నాయని గణాంకాలు చెబుతుండగా అందులో 518 మంది రాజధానికి చెందిన వారని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. మిగిలిన వారంతా లాక్‌డౌన్‌ సమయంలో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చినవారు.

మరణాలకు కారణాలివీ..

వైరస్‌ సోకినా యుక్త వయసులో ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారని, వృద్ధుల విషయంలోనే నష్టం జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, ఇటీవలే బైపాస్‌ సర్జరీలు చేసుకున్నవారు, అల్సర్‌, ఆస్తమా, ఇతర రుగ్మతలతో బాధపడుతోన్న వృద్ధులు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. వారిలో వ్యాధి నిరోధకశక్తి చాలా తక్కువగా ఉండటంతో మరణాల రేటు ఎక్కువగా ఉంటోందన్నారు. ‘మూత్రపిండాల సమస్య ఉన్నవారు తరచూ డయాలసిస్‌ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ సమయంలో వైరస్‌ పంజా విసురుతోంది. సూక్ష్మక్రిమి మూత్రపిండాలతోపాటు శరీర భాగాలన్నింటినీ ప్రభావితం చేస్తోంది. గుండెకు, మెదడుకు ప్రాణవాయువు అందక మరణాలు సంభవిస్తున్నాయి. అలాగని అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇతర రుగ్మతలున్న పలువురు వృద్ధులు వైరస్‌ను జయిస్తున్నారు’ అని వైద్యులు చెబుతున్నారు.

వృద్ధులు, చిన్నారులు ఇంట్లో ఉన్నా కుటుంబ సభ్యులను కలిసినప్పుడు మాస్కు ధరించాలి. ఎడం పాటించాలి. సబ్బుతో చేతులను ఎక్కువసార్లు శుభ్రం చేసుకోవాలి. శ్వాస సమస్యలు, జ్వరం, ఇతర కరోనా లక్షణాలుంటే కొవిడ్‌ పరీక్షలు చేస్తోన్న ఆస్పత్రులను సంప్రదించాలి. లాక్‌డౌన్‌ సడలించాక బయటకెళ్లి వచ్చినవారి ద్వారా వృద్ధులు, పిల్లలు కొవిడ్‌ బారినపడే అవకాశముంది.

- లోకేశ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.