ETV Bharat / state

కరోనా సినిమాకే సినిమా చూపిస్తోంది! - corona in telangana

కరోనా వైరస్ సినిమాకే సినిమా చూపిస్తోంది. సినిమా హాళ్లను మూసివేయించిన వైరస్​.. చిత్రసీమను సంక్షోభంలోకి నెట్టింది. కొవిడ్ కాటుకు మూతపడ్డ టాకీసుల తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఫలితంగా వెండితెరను ఆవహించిన నిశ్శబ్దం.. థియేటర్‌పై ఆధారపడిన ఎన్నో కుటుంబాల జీవోనపాధిని దెబ్బతీస్తోంది. వైరస్ ప్రభావం తగ్గినా.. లాక్‌డౌన్ ఎత్తేసినా సినిమా టాకీసుల తలుపులు అంత త్వరగా తెరుచుకోవడం అసాధ్యమని చిత్రపరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

corona effect on movie theaters in telugu states
సినిమా థియేటర్లపై కరోనా ప్రభావం
author img

By

Published : May 3, 2020, 11:24 AM IST

శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్ల ముందు జాతరే. ఇక వేసవంటే ఆ లెక్కే వేరు. అగ్ర కథనాయకుల చిత్రాలు వరుసకడుతుంటాయి. టాకీసు ప్రాంగణమంతా కటౌట్లు, పోస్టర్లు, ప్రేక్షకుల హోరుతో సందడిగా ఉంటుంది. సినిమా హిట్టైతే వారమంతా అదే ఉత్సాహంతో బాక్సాఫీసు వసూళ్ల వర్షం కురుస్తుంటుంది.

అలాంటి ఉత్సాహం కారణంగానేమో ఏడాదికి సగటున 10 శాతం విజయాలే వచ్చినా... చిత్రసీమ ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. కానీ ఇప్పుడు ఆ ఉత్సాహం ఒక్కసారిగా మాయమైంది. సినీ పరిశ్రమను కరోనా కాటేసి.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూగబోయేలా చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో 18 వందలకుపైగా థియేటర్లు

తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌లు కలిపి 18 వందలకుపైగా థియేటర్లు ఉన్నాయి. అందులో ఆరు వందలు తెలంగాణలో ఉంటే... 12 వందల థియేటర్లు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఒక్కో సినిమా హాల్ పై 14 నుంచి 20 మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఒక్కసారిగా వాటిని మూసివేయడంతో అందులో పనిచేసే ఉద్యోగులు, వాటిపై ఆధారపడిన వ్యాపారులు ఉపాధి కోల్పోయారు.

టాకీసులకు తాళాలు పడటంతో ఈ నెలరోజుల్లో థియేటర్ లోపనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి అయోమయంలో పడింది. థియేటర్లవైపు రావాలంటేనే బాధగా ఉందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, వారానికి ఒక్కో థియేటర్​కు సగటున 3 లక్షల నష్టం వాటిల్లుతోంది. దీంతో యజమానులు, లీజుదారులు, వాటి నిర్వహణ భారం భరించాల్సి వస్తోంది. సాధారణ రోజుల్లో ఒక్కో సింగిల్ స్క్రీన్ థియేటర్ లో నెలవారి ఖర్చు లక్షన్నర నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. అదే మల్టిప్లెక్స్​ల్లో 5 నుంచి10 లక్షల దాటుతుంది.

భౌతిక దూరాన్ని పాటించేలా థియేటర్లలో సీట్ల సర్దుబాటు

మరోవైపు ఆరు నెలల దాకా థియేటర్లు తెరుచుకోవడం కష్టమేనని పలు థియేటర్ల యజమానులు, పలువురు సినీ నిర్మాతలు అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు థియేటర్లను ప్రభుత్వం చివరి అంశంగా పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో మరో ఆరు మాసాలపాటు టాకీసులకు తాళాలు తప్పవని భావిస్తున్నారు.

లాక్ డౌన్ ఎత్తివేశాక థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు వస్తారని నమ్మకం లేదని వాపోతున్నారు. ఆ దిశగా థియేటర్లను ముందుజాగ్రత్త చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భౌతిక దూరాన్ని పాటించేలా థియేటర్లలో సీట్ల సర్దుబాటుతోపాటు ప్రదర్శనల కుదింపు, ఎప్పటికప్పుడు పరిసరాలను శానిటైజ్ చేయడం, ప్రేక్షకులు కూర్చునే సీట్లను ఆటకు ఆటకు మధ్య పరిశుభ్రం చేయడం, సగం వరకే టికెట్లు విక్రయించి ప్రేక్షకుల మధ్య దూరం ఉండాలే చూడటం, విశ్రాంత సమయం, విడుదల సమయాల్లో లోపలికి, బయటకు వెళ్లే మార్గాల్లో తప్పనిసరిగా క్యూ పద్ధతులను పాటించేలా చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

పూర్తిగా అనుకూలించాకే పెద్ద సినిమాల విడుదల

థియేటర్ల తెరుచుకోవడంపై అగ్ర నిర్మాతలు కూడా సందిగ్ధంలో పడ్డారు. థియేటర్లు తెరుచుకున్నా పెద్ద సినిమాల ప్రదర్శన ఇప్పట్లో సాధ్యం కాదని చెబుతున్నారు. టాకీసుల్లో పరిస్థితులు పూర్తిగా అనుకూలించాకే పెద్ద సినిమాల విడుదల చేయాలనే ఆలోచనలు ఉన్నారు. అప్పటి వరకు వాయిదా పడ్డ సినిమాలు, చిత్రీకరణ మధ్యలో నిలిచిపోయిన సినిమాల బడ్జెట్ పై వడ్డీల భారం మోయకతప్పదని నిర్మాతలు పేర్కొంటున్నారు. మరోవైపు చిన్న సినిమాల నిర్మాతలు కూడా వేచిచూసే ధోరణిలో ఉన్నారు.

ఇవీ చూడండి: తెలంగాణలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్​జోన్ జిల్లాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.