ETV Bharat / state

మూడు ముళ్లకు కరోనా ముల్లు!

కరోనా... మూడు ముళ్ల బంధాలకు అడ్డు పడుతోంది. జీవితంలో ఒకేసారి ఎంతో వేడుకగా జరిగే కార్యక్రమాన్ని వైభవంగా జరిపించాలా..మమ అనిపించాలా..వాయిదా వేసుకోవాలా...అని చాలామంది సతమతమవుతున్నారు. ఈ నెల 25 నుంచి మే నెలాఖరు వరకూ భారీ సంఖ్యలో ముహూర్తాలున్నాయి. పెళ్లి రిసెప్షన్ల కోసం ఇప్పటికే నగరంలో ఫంక్షన్‌ హాళ్లకు అడ్వాన్సులు ఇచ్చేశారు. భారీ ఎత్తున వేడుక జరిపేందుకు నిర్ణయించారు. బంధువులు, స్నేహితులకు ఆహ్వానాలు పంపారు. కరోనా మహమ్మారి విరుచుకు పడుతుండటంతో వారి ఆలోచనల్లో మార్పు వస్తోంది.

corona-effect-on-marriages
మూడుముళ్లకు.. కరోనా ముల్లు!
author img

By

Published : Apr 23, 2021, 9:17 AM IST

* అంబర్‌పేటకు చెందిన దంపతులు కుమారుడికి వివాహం చేయడానికి మే 3న ముహూర్తం నిర్ణయించారు. భారీగా రిసెప్షన్‌ చేయాలనుకున్నారు. ఎర్రగడ్డ వద్ద ఓ ఫంక్షన్‌ హాల్‌ను బుక్‌ చేసుకున్నారు. కరోనా విజృంభిస్తుండటంతో చివరకు రిసెప్షన్‌ రద్దు చేసుకుని...అతి తక్కువ మంది బంధువుల మధ్య గుడి లేదా రిజిస్టర్‌ పెళ్లి జరిపిద్దామని నిర్ణయించారు.

* బంజారాహిల్స్‌లో ఉంటున్న దంపతులు తమ కుమార్తె పెళ్లిని సొంతూరులో భారీ ఎత్తున జరిపేందుకు నిర్ణయించారు. ప్రత్యేక బస్సులు మాట్లాడారు. భారీగా వస్తున్న కరోనా కేసులతో ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. పరిస్థితి చేయి దాటితే బంధువులు కుటుంబ సభ్యుల మధ్య చేయాలని భావిస్తున్నారు.

కానీ ఇప్పుడు పరిస్థితి చేదాటి పోతుంది. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో పెళ్లి, విందు అంటే జన సమూహం చేరుతుంది. ఒక్కరికి కరోనా ఉన్నా... ఎందరినో చుట్టేయడం ఖాయం. ఈ నేపథ్యంలో చాలామంది పునరాలోచనలో పడుతున్నారు. కొందరు పెళ్లి ఎలాగోలా జరిపించేసి విందును రద్దు చేసుకోవాలని భావిస్తున్నారు. కొందరైతే పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. మరికొందరు అదే ముహూర్తాలకు నిరాడంబరంగా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేయించి.. పరిస్థితి కుదుటపడ్డాక విందు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మరికొందరు ఇరువైపులా వృద్ధులను వేడుకకు దూరంగా ఉంచి.. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివాహం చూసేలా ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

* కొవిడ్‌ను చాలామంది ఇంకా సీరియస్‌గా తీసుకోవడం లేదు. వచ్చే నెల రోజుల్లో పెళ్లిళ్లు ఎక్కువ సంఖ్యలో జరగనున్నాయి. అలా అయితే..మరింతగా విజృంభించే అవకాశం ఉంది.

* పెళ్లి విందు వద్ద తినే సమయంలో మాస్క్‌ తీయాల్సి ఉంటుంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా వివాహాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. దీంతో వైరస్‌ వ్యాప్తి బాగా పెరిగే అవకాశం ఉంది.

* దిల్లీలో ఒక పెళ్లిలో 40 మందికి కరోనా సోకింది. ఇందులో పలువురి ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. కాబట్టి పెళ్లిళ్లలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి.

* పెళ్లికి రెండు వైపులా 20 మందికి మించి బంధువులు హాజరు కాకపోవడమే ఉత్తమం. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వారి తల్లిదండ్రులు 15 రోజుల ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలి. ఇతర కుటుంబ సభ్యులు, బంధువులను వీరికి దూరంగా ఉంచాలి.

* వివాహం తర్వాత కొత్త జంటకు బొకేలు, బహుమతులు లాంటివి ఇచ్చేందుకు వెళ్లక పోవడమే మంచిది. విందు కూడా పరిమితం చేయాలి.

* నూతన జంటతో సహా ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలి. పందిరి వద్ద అతి తక్కువ మంది మాత్రమే కూర్చోవాలి. పెద్దలను దూరంగా పెట్టాలి. చేతులను తరచూ శానిటైజ్‌ చేసుకోవాలి.

* ఇక సంగీత్‌, మెహిందీ ఫంక్షన్‌, బరాత్‌ లాంటి కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసుకోవడం చాలా ఉత్తమం. ఈ కార్యక్రమాల ద్వారా వైరస్‌ విజృంభించే అవకాశం ఉంది.

- డాక్టర్‌ సచిన్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, మెడికవర్‌

ఇదీ చూడండి: 'మహా' కల్లోలం- కొత్తగా 67వేల మందికి కరోనా​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.