కరోనా వైరస్ కారణంగా స్వర్ణకారుల పరిస్థితి దయనీయంగా తయారైందని స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు దుబ్బాక కిషన్ రావు తెలిపారు. స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించే వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అందులో భాగంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాన్ని అందజేశారు.
లాక్ డౌన్ నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు. బంగారం ధర అమాంతంగా పెరగడం వల్ల స్వర్ణకారుల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేయూత అందించాలని వేడుకున్నారు. స్వర్ణకారులకు ప్రభుత్వం పావలా వడ్డీకి రూ. 5 లక్షల రుణ సదుపాయాన్ని కల్పించే విధంగా కృషి చేయాలన్నారు. ఆరోగ్యరీత్యా హెల్త్ కార్డులు కూడా అందించాలని కోరారు.