ETV Bharat / state

కరోనా ప్రభావం.. బతుకు జీవుడా అంటున్న చిరు వ్యాపారులు - కుదేలవుతున్న చిరువ్యాపారాలు తాజా వార్త

రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు.. రోజూ ఆటో నడిపితే తప్ప మూడు పూటలా కుటుంబం కడుపు నింపలేని పరిస్థితి.. కూలీ పనికి వెళ్తే తప్ప గంజికి గతి లేని జీవితాలు.. ఇలాంటి వారందరి పట్ల కరోనా తీవ్ర ప్రభావమే చూపింది. లాక్​డౌన్​ వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది ఒకప్పుడు ఏదో ఒక పని దొరుకుతుందన్న ఆశ.. ఇప్పుడు వారి కళ్లల్లో కనిపించడం లేదు. చిరు బతుకుల జీవితాలపై కరోనా విసిరిన పంజా వారిని కోలుకోలేని దెబ్బ తీసింది. బడుగు జీవుల దీనస్థితిపై ప్రత్యేక కథనం..!

corona-effect-on-daily-wage-labours-and-small-merchants
కరోనా ప్రభావం.. బతుకు జీవుడాంటున్న చిరువ్యాపారులు
author img

By

Published : Jul 13, 2020, 8:20 AM IST

నిర్మాణ కూలీలు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, రిక్షా కార్మికులు, కంప్యూటరు, మొబైల్‌ సర్వీసు సెంటర్ల నిర్వాహకులు, చిరుతిళ్ల వ్యాపారుల జీవితాలపై లాక్‌డౌన్‌ చావుదెబ్బ కొట్టింది. వ్యాపారాలు సాగకపోవటం వల్ల వీరి కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. మున్ముందు పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా మారుతుందోనంటూ ఆందోళన చెందుతున్నారు. నిర్మాణ కూలీలు ఏడాదిగా గడ్డురోజులను ఎదుర్కొంటున్నారు. గతేడాది జులై నుంచి ఆరు నెలలపాటు ఇసుక లేక పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత... మూడు నెలలపాటు పనులు బాగానే సాగాయి. అంతలోనే కరోనా విరుచుకుపడింది. రెండు నెలలపాటు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. పదిహేను రోజుల నుంచి ఓ మోస్తరుగా పనులు జరుగుతున్నా... పెద్దగా మార్పేమీ రాలేదు. ఆంధ్రప్రదేశ్​ విజయవాడ బెంజి సర్కిల్‌ అడ్డాకు గతంలో రోజూ 300 మంది వరకు కూలీలు వచ్చేవారు. ఇప్పుడా సంఖ్య 200కి పడిపోయింది. వీరిలో రోజుకి 30 మందికైనా పని దొరకట్లేదు. ‘పొద్దున రావడం.. మధ్యాహ్నం ఇంటికి వెళ్లడం.. ఇదే సరిపోతుంది. అప్పులు చేసే బతుకుతున్నాం’ అని తాపీ మేస్త్రీ మాణిక్యాలరావు వాపోయారు.

ఆటో డ్రైవర్లు కుదేలు

ఏపీ విజయవాడ బస్టాండు సెంటర్‌లో కనీసం 100-150 వరకు ఆటోలుంటాయి. వాటిలో రెండు, మూడింటికి మాత్రమే రోజుకు రూ.200 నుంచి రూ.300 వరకు గిట్టుబాటవుతోంది. గతంలో ఆటోలో కనీసం అయిదుగురు కూర్చునేవారు. ఇప్పుడు.. ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ కూర్చోవడానికి వీల్లేదు. దానితో నిర్వహణ ఖర్చులు సైతం రావట్లేదు. తినడానికి కష్టమైనా కిస్తీ మాత్రం చెల్లించాలనుకుని... ఈసారి వచ్చిన వాహనమిత్ర డబ్బంతా కట్టేశానని బెంజ్‌ సర్కిల్‌ అడ్డాకు చెందిన ఆటోడ్రైవర్‌ రాజేశ్‌ తెలిపారు.

  • ‘గతంలో రోజంతా వేచి చూస్తే సరకును తరలించో... పెద్దవాళ్లు దయతలిచి ఎక్కితేనో రూ.రెండొందలైనా వచ్చేవి. ఇప్పుడు ఒక్కరు తినే మందం కూడా సంపాదించలేకపోతున్నాం’ అని విజయవాడ రైల్వేస్టేషన్‌ సమీపంలోని రిక్షా కార్మికుడు రాజయ్య కన్నీరు పెట్టుకున్నారు.
  • జనం బయటి తిళ్లపై ఆసక్తి కనబరచట్లేదని పటమటలో ఫ్రైడ్‌రైస్‌ బండి నడిపే ప్రమోద్‌, సాధారణ వ్యాపారంలో 10 శాతం కూడా జరగడం లేదని విజయవాడలో ల్యాప్‌టాప్‌ సర్వీసింగ్‌ దుకాణం నడిపే చేకూరి హరిబాబు వాపోయారు. తమలాంటి వారందరికీ ప్రభుత్వమే దారి చూపాలని కోరుతున్నారు.

ఇవీచూడండి: మహంకాళి అమ్మవారికి ఆ ఇంటి నుంచి తొలి బోనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.