ETV Bharat / state

క్యాంపస్​ ప్లేస్​మెంట్లపై కరోనా దెబ్బ - corona effect on every company

క్యాంపస్​ ప్లేస్​మెంట్లపై కరోనా ప్రభావం పడింది. మార్చి నుంచి వర్సిటీలకు ఒక్క కంపెనీ కూడా రాలేదు. జులైలో జరిగే నియామకాలను కూడా సెప్టెంబరుకు వాయిదా వేశారు. డిసెంబరు-ఫిబ్రవరి మధ్య జరిగిన ప్రాంగణ నియామకాలపై మాత్రం కరోనా ప్రభావం చూపలేదు.

corona effect on campus placecments
ప్రాంగణ నియామకాలపై కరోనా దెబ్బ
author img

By

Published : Jun 2, 2020, 10:18 AM IST

ప్రాంగణ నియామకాలపై కరోనా ప్రభావం పడింది. లాక్‌డౌన్‌తో విద్యాసంస్థలు మూతపడి, కంపెనీలు వచ్చే వీల్లేక నగరంలోని విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయి. సాధారణంగా డిసెంబరు నుంచి ఫిబ్రవరి మధ్య నగరంలో వర్సిటీలు, కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు జరుగుతుంటాయి. ఆ తర్వాత మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ‘డ్రాపవుట్స్‌ నియామకాలు’ జరిగేవి. సెమిస్టర్‌ పరీక్షలు ముగిసిన తర్వాత నేరుగా విద్యార్థులు ఉద్యోగాలలో చేరేందుకు వీలుండేది.

కరోనా ప్రభావంతో మార్చి నుంచి వర్సిటీలకు ఒక్క కంపెనీ రాలేదు.హెచ్‌సీయూ, జేఎన్‌టీయూ, ఉస్మానియా సహా ప్రధాన కళాశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఏటా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 350-370 మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఎంపికవుతుంటారు. ఈ ఏడాది డిసెంబరు-ఫిబ్రవరి మధ్యకాలంలో 220 మందికి కొలువులు దక్కాయి. మార్చి-మే నెలల్లో మరో 100-150 మందికి ఉద్యోగాలు లభిస్తాయని భావించారు. లాక్‌డౌన్‌తో కంపెనీల ప్రతినిధులు రాకపోకలు సాగించే వీల్లేకపోవడం, విద్యార్థులు అందుబాటులో లేకపోవడంతో నియామకాలపై ప్రభావం పడింది. ఏటా జులై, ఆగస్టులో కొన్ని కంపెనీలు ముందుకు వస్తుంటాయి. ఇవి కూడా జరుగుతాయో లేదోనన్న సందేహం నెలకొంది.

ఆన్‌లైన్‌ ముఖాముఖీలు

కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌ పరీక్షలు, ముఖాముఖిలు నిర్వహిస్తున్నాయి. రెండు ప్రముఖ కంపెనీలు హెచ్‌సీయూ విద్యార్థులకు వీటిని నిర్వహించాయి. ‘లాక్‌డౌన్‌తో రానున్న కొద్దిరోజులపాటు వర్చువల్‌ నియామకాలకు ప్రాధాన్యం ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ సంస్థలతో చర్చిస్తూ నియామకాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని హెచ్‌సీయూ ప్రాంగణ నియామకాల విభాగం సంచాలకులు రాజీవ్‌ వాంఖర్‌ తెలిపారు.

పాత నియామకాలకు భరోసా

డిసెంబరు-ఫిబ్రవరి మధ్య జరిగిన ప్రాంగణ నియామకాలపై కరోనా ప్రభావం చూపలేదనే చెప్పాలి. లాక్‌డౌన్‌తో కంపెనీల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడటంతో ఇప్పటికే ఉద్యోగ లేఖలు అందుకున్న విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ట్రిపుల్‌ఐటీ, బిట్స్‌ పిలానీ, హెచ్‌సీయూలో కొందరికి రూ.45 లక్షలకుపైగా వార్షిక వేతనంతో కొలువులు దక్కాయి.ఈ ఏడాది బిట్స్‌కు చెందిన 4 క్యాంపస్‌లలో 1754 మంది విద్యార్థులకు కొలువులు దక్కినట్లు అధికారులు తెలిపారు. ‘డిసెంబరు నుంచి ఫిబ్రవరి మధ్య జరిగిన నియామకాలపై కరోనా ప్రభావం పడుతుందేమోనని భావించాం. ఏ కంపెనీ ఆఫర్‌ లెటర్స్‌ ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పలేదు’ అని నగరానికి చెందిన ఓ వర్సిటీ ప్రాంగణ నియామక అధికారి తెలిపారు.

ఇవీ చూడండి: నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.