గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,15,515 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 729 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,36,049కి చేరింది. తాజాగా వైరస్‌తో ఐదుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,704కు చేరింది. కరోనా నుంచి 772 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 6,22,313కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,980 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో కొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా మిగతా వారు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
తాజాగా వచ్చిన కేసులలో జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులు, ఆదిలాబాద్ జిల్లాలో 3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 కేసులు, జగిత్యాల జిల్లాలో 22 కేసులు, జనగామ జిల్లాలో 6, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 13 కేసులు, జోగులాంబ గద్వాల జిల్లాలో 5, కామారెడ్డి జిల్లాలో 3 కేసులు, కరీంనగర్ జిల్లాలో 65 కేసులు, ఖమ్మం జిల్లాలో 52 కేసులు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 5 కేసులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 6 కేసులు, మహబూబాబాద్ జిల్లాలో 13 కేసులు, మంచిర్యాల జిల్లాలో 53, మెదక్ జిల్లాలో 6 కేసులు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 25 కేసులు, ములుగు జిల్లాలో 13 కేసులు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 4 కేసులు, నల్గొండ జిల్లాలో 45 కేసులు, నారాయణపేట జిల్లాలో 0 కేసులు, నిర్మల్ జిల్లాలో 4 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 6 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 53 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 21 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 26 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 5 కేసులు, సిద్దిపేట జిల్లాలో 17 కేసులు, సూర్యాపేట జిల్లాలో 44 కేసులు, వికారాబాద్ జిల్లాలో 6 కేసులు, వనపర్తి జిల్లాలో 8 కేసులు, వరంగల్ రూరల్ జిల్లాలో 41 కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 47 కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 18 కేసుల చొప్పున నమోదయ్యాయి.
మరోవైపు మూడో ముప్పు ముంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. వ్యక్తుల మధ్య తప్పక భౌతిక దూరం పాటించాలన్నారు. కొవిడ్ టీకాలపై అపోహలు వీడి.. ప్రతి ఒక్కరూ విధిగా టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ఈసారి ఖైరతాబాద్ బడా గణేశ్ ఎత్తెంత? ఏ రూపంలో దర్శనమిస్తాడో తెలుసా?