హైదరాబాద్‌లో కరోనా మరింత వేగంగా వ్యాపిస్తోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సుల్తాన్ బజార్ ఏసీపీకి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. జీహెచ్ఎంసీ యూసుఫ్ గూడ -19 పరిధిలో కొత్తగా 40 మందికి పాజిటివ్‌గా తేలింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో 38 కరోనా కేసులు నమోదయ్యాయి. చింతల్ పరిధిలో 10 కేసులు నమోదవగా, జీడీమెట్ల పరిదిలో ఏడుగురు వైరస్ బారినపడ్డారు.
జగద్గిరిగుట్ట, గాజులరామరం, బాచూపల్లి, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సంజయ్ గాంధీ నగర్, ప్రగతి నగర్, షాపూర్ నగర్ ప్రాంతాల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కుత్బుల్లాపూర్‌లోని సురారం-సాయిబాబా నగర్‌కు చెందిన 63 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 345 మంది కరోనా బారిన పడగా... 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
అంబర్‌పేట నియోజక వర్గ పరిధిలో కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు మరణించారు. ఇందులో కాచిగూడ పరిధిలో ఇద్దరు, అంబర్‌పేట బతుకమ్మకుంటలో ఒకరు గాంధీలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మూసాపేట్ సర్కిల్లో 80, కూకటపల్లి సర్కిల్లో 32 కరోనా కేసులు నమోదయ్యాయి. బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో ఐదుగురు వైరస్ బారినపడినట్లు అధికారులు నిర్ధరించారు.
ఇదీ చూడండి: టికెటింగ్ కంపెనీల ఆదాయం ఫట్.. వేతనాల్లో భారీ కోతలు