ETV Bharat / state

ఏపీలో మరో 35 కరోనా పాజిటివ్ కేసులు - ఏపీలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా... మొత్తం కేసుల సంఖ్య 757కు చేరింది. కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 184 మందికి వైరస్ సోకింది.

corona-cases-raised-to-757-in-ap
ఏపీలో మరో 35 కరోనా పాజిటివ్ కేసులు
author img

By

Published : Apr 21, 2020, 12:42 PM IST

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 35 పాజిటివ్ కేసులను అధికారులు నిర్ధరించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 757కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో 5022 నమూనాలను పరీక్షించగా 35 మందికి కోవిడ్-19 పాజిటివ్​గా తేలిందని.... ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొంది.

corona-cases-raised-to-757-in-ap
ఏపీలో మరో 35 కరోనా పాజిటివ్ కేసులు

కొత్తగా కర్నూలు జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 9, కడప జిల్లాలో 6, పశ్చిమ గోదావరి జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. కరోనాతో చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మృతి చెందగా.... మొత్తం మరణాల సంఖ్య 22కు చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 96 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో 639 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఇవీ చూడండి: చాపకింద నీరులా కరోనా... ఈ మహమ్మారి ఆగేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.