ETV Bharat / state

బల్దియాలో ప్రత్యేకాధికారులున్నా ఏం లాభం..! - జీహెచ్​ఎంసీ

గ్రేటర్​లో క‌రోనా నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేసులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్ర‌త్యేకాధికారుల‌ను బ‌ల్దియా నియమించింది. అయితే వారిలో కొంద‌రు క్షేత్ర‌స్థాయిలోకి వెళ్లడం లేదు. ఫలితంగా నియంత్రణ కరువై.. వైర‌స్ మ‌రింత వ్యాప్తి చెందుతోంది. ఇదే విష‌యంపై ఇటీవల జ‌రిగిన సమీక్ష‌లో సంబంధిత అధికారుల‌పై సీఎస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.

Corona cases on the rise in Greater hyderabad due to officers neglegency
గ్రేటర్​లో పెరుగుతున్న కరోనా కేసులు.. పట్టించుకునే నాథుడే లేడు!
author img

By

Published : Jul 25, 2020, 5:06 PM IST

గ్రేటర్ హైదరాబాద్​లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. ఎక్కువగా ఎనిమిది సర్కిళ్ల నుంచి వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఐదు సర్కిళ్లతో పాటు, కూక‌ట్ ప‌ల్లి , శేరిలింగపల్లి, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో ఒక్కో సర్కిల్​ను హైరిస్క్​ ప్రాంతాలుగా ప్రకటించారు. అయితే ఈ ఎనిమిది సర్కిళ్లలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ... అక్కడ ప్ర‌త్యేకాధికారుల‌ను ఏర్పాటు చేసింది. కేసులు ఎక్కువగా నమోదైన సర్కిళ్లలో అడిషనల్ కమిషనర్లకు జీహెచ్​ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్​కుమార్ బాధ్యతలు అప్పగించారు.

సర్కిళ్లవారీగా అడిషనల్​ కమిషనర్లకు బాధ్యతలు

శేరిలింగంపల్లి జోన్​లోని యూసుఫ్​గూడకు అడిషనల్ కమిషనర్ యాదగిరికి, సికింద్రాబాద్ జోన్​లోని అంబర్​పేట్​కు అడిషనల్ కమిషనర్ కెన్నెడీ, ఖైరతాబాద్ జోన్​లోని మెహదీపట్నంకు అడిషనల్ కమిషనర్ శంకరయ్య, కార్వాన్​కు జేసీ సంధ్య, చార్మినార్ జోన్​లోని చాంద్రాయణగుట్టకు అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మికి, చార్మినార్ జోన్​​ లోని చార్మినార్​కు అడిషనల్ కమిషనర్ రాహుల్ రాజ్​కి, చార్మినార్ జోన్​లోని రాజేంద్ర నగర్​కు అడిషనల్ కమిషనర్ సంతోష్​కు, కూకట్​పల్లి జోన్​లోని కుత్బుల్లాపూర్​కు ఇన్​ఛార్జిగా ప్రియాంక అలకు బాధ్యతలు ఇచ్చారు. వీరు ప్రతిరోజు అక్కడి ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి అమలు చేయాలి. కానీ ఇంతవరకు బాగానే ఉన్నా అక్కడి కట్టడి చర్యలు సమగ్రంగా జరగడం లేదన్న విమర్శలొస్తున్నాయి.

ఇప్పటికైనా పట్టించుకోవాలి..

హైరిస్క్​ సర్కిళ్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ల నిర్వహణ పూర్తిస్థాయిలో జరగడం లేదని... అక్కడ పాజిటివ్ వచ్చిన వారికి ఐసోలేష‌న్ కిట్లు అందించడంలో కూడా విఫలం అవుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన మూడు, నాలుగు రోజుల వ‌ర‌కు కిట్లు అందించ‌డం లేద‌ని బాధితులు వాపోతున్నారు. ఇక యాక్టివ్ కేసులు వందల సంఖ్యలో ఉన్నప్పటికీ కంటైన్మెంట్ జోన్లు మాత్రం పెట్ట‌డం లేదు. ఫలితంగా ప్ర‌త్యేక అధికారులను కేటాయించి దాదాపు 15 రోజులు అవుతున్నా... కేసుల సంఖ్యలో మార్పురాలేదు. పలు సర్కిళ్లలో 8 వందల నుంచి 12 వందల వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇదే కాదు ప్రైవేటు ఆసుపత్రుల్లో టెస్టులు చేయించుకుని పాజిటివ్ నిర్దార‌ణ‌ అయిన వారి వివరాలు కూడా వీరు త్వరగా తెప్పించుకోవడం లేదు. జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడం వల్ల మూడు నాలుగు రోజుల తర్వాత రోగులు లేదా వారి చుట్టు పక్కల వారు బల్దియా కంట్రోల్ రూమ్ లేదా అధికారులకు కాల్ చేసి తమ ప్రాంతంలో పాజిటివ్ వచ్చిందని... అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయినా అధికారుల దగ్గర నుంచి పూర్తి స్థాయి సహకారం అందడం లేదు. ఇదే వైర‌స్ మ‌రింత వ్యాప్తికి కార‌ణం అవుతోంద‌ని న‌గ‌ర ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా బ‌ల్దియా అధికారులు ప‌ట్టించుకోవాల‌ని కోరుతున్నారు.

ఇవీ చూడండి: అంబులెన్స్​ సిబ్బంది నిర్లక్ష్యం.. రోడ్డుపైనే వాడిన పీపీఈ కిట్ల పడవేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.