ETV Bharat / state

అజాగ్రత్తగా ఉంటే ముప్పే... మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్న క్రమంలో కేసుల నమోదులో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. బాధితుల సంఖ్య ఉన్నట్టుండి దాదాపు 30-40 శాతం పెరగడం ప్రమాద సూచికేనని వైద్యనిపుణులు చెబుతున్నారు.

అజాగ్రత్తగా ఉంటే ముప్పే... మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
అజాగ్రత్తగా ఉంటే ముప్పే... మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
author img

By

Published : Jan 7, 2021, 6:58 AM IST

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో పది రోజుల కిందట 30 మంది కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతుండగా, బుధవారం నాటికి ఆ సంఖ్య 100కి పెరిగింది. వీరిలో మూణ్నాలుగు రోజుల వ్యవధిలోనే వైరస్‌ సోకిన వారు 50 మందికిపైగా ఉన్నారు. మొత్తంగా ఆసుపత్రిలో చేరుతున్న బాధితుల సంఖ్య ఉన్నట్టుండి దాదాపు 30-40 శాతం పెరగడం ప్రమాద సూచికేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న తరుణంలో ఈ పెరుగుదల ఆందోళన కల్గించే అంశమేనని అభిప్రాయపడుతున్నారు.

పెరుగుతూ.. తగ్గుతూ...

రాష్ట్రంలో తొలి కొవిడ్‌ కేసు 2020 మార్చి 2న నమోదు కాగా.. ఆ నెలలో 97 పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి వరుసగా ఏప్రిల్‌(941), మే(1,768), జూన్‌(13,534), జులై(48,446), ఆగస్టు(62,911), సెప్టెంబరు(65,903) మాసాల వరకూ ఉద్ధృతి కొనసాగింది. ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో క్రమేణా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అక్టోబరులో 46,448, నవంబరులో 30,270, డిసెంబరులో 23,191 నమోదయ్యాయి.

ఈ మూడు నెలల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఎప్పటిలాగే విధుల్లోకి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కాలంలో ప్రధాన పండుగలన్నింటినీ ప్రజలు ఎప్పటిలా జరుపుకున్నారు. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయని ఆరోగ్యశాఖ ఆందోళన చెందింది. వేర్వేరు మాధ్యమాల ద్వారా ముందస్తు జాగ్రత్తలపై పదేపదే అవగాహన కల్పించిన ఫలితంగా వ్యాప్తి ఊహించిన విధంగా జరగలేదు.

అనూహ్య పెరుగుదల...

రాష్ట్రంలో డిసెంబరు 30న 461 పాజిటివ్‌లు నమోదు కాగా, ఆ తర్వాత(2వతేదీ 394, 3న 238, 4న 253) కాస్త తగ్గాయి. తాజాగా 5వ తేదీన 417(3వ తేదీతో పోలిస్తే 179 అదనం) కేసులు బయటపడ్డాయి. అంటే రెండు,మూడు రోజుల వ్యవధిలోనే సరాసరిన సుమారు 30శాతం పెరుగుదల నమోదయ్యింది. ఈ అనూహ్య పెరుగుదలపై ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కొత్త సంవత్సర వేడుకల్లో కొందరు నిబంధనలను ఉల్లంఘించి యథేచ్ఛగా పాల్గొన్న ప్రభావం పాజిటివ్‌ల పెరుగుదలపై కనిపిస్తోందని ఆ శాఖ అంచనా వేస్తోంది. చలి తీవ్రత కూడా వైరస్‌ వ్యాప్తికి కారణమై ఉంటుందని పేర్కొంటున్నారు. అందులోనూ రెండు యూకే వైరస్‌ కేసులు రాష్ట్రంలో వెలుగుచూసిన నేపథ్యంలో, ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని ఆ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు.

నిబంధనలు గాలికొదిలేయడం వల్లనే..

* కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో వైరస్‌ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందనే భావన ఎక్కువమంది ప్రజల్లో నెలకొంది.

* మరణాల శాతం తక్కువగా ఉండడంతో తమకేమీ కాదనే మొండితనం కొందరిలో కనిపిస్తోంది. ముఖ్యంగా యువతలో ఈ తరహా ధోరణి ఎక్కువగా ఉంది.

* ఎక్కువ మంది ముఖానికి మాస్కు ధరించడం లేదు. ధరించినా ముక్కు, నోరు కప్పిఉంచేలా చూసుకోవడం లేదు. మాట్లాడినప్పుడు మాస్కు తీసేస్తున్నారు. అలా చేస్తే రక్షణ లేనట్లే.

* తరచూ చేతులు శుభ్రపర్చుకోవడం, గుంపుల్లో తిరగకపోవడం, 6 అడుగుల దూరాన్ని పాటించడం వంటి నిబంధనలకు తూట్లు పొడిచారు.

ప్రపంచ దేశాల్లో కొవిడ్‌ రెండో ఉద్ధృతిని చూస్తున్నాం. సుమారు ఆరు కోట్ల జనాభా ఉన్న బ్రిటన్‌లో ఒక్కరోజులోనే 60 వేల కేసులు నమోదవడం తీవ్రతను తెలియజేస్తోంది. అమెరికా సహా పలు యూరప్‌ దేశాలు కొవిడ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అదృష్టవశాత్తు దేశంలో ఆ స్థాయిలో వ్యాప్తి లేదు. ఈ ధైర్యంతోనే కొందరు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. ఇలాగే నిబంధనలను ఉల్లంఘిస్తే కేసుల సంఖ్య మళ్లీ పెరిగే ప్రమాదముంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో ఉన్నట్టుండి పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశాలుంటాయి. అందరూ మాస్కు ధరించడం, చేతులు శుభ్రపర్చుకోవడాన్ని క్రమం తప్పకుండా పాటించాలి.

- డాక్టర్‌ ఎంవీ రావు, ప్రముఖ జనరల్‌ ఫిజీషియన్‌

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా మరోసారి టీకా​ డ్రై రన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.