ETV Bharat / state

హైదరాబాద్​ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..

భాగ్యనగరాన్ని కరోనా కమ్మేస్తోందా?... ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కరోనా కాటేసే ప్రమాదముందా అంటే ... ఇటీవల నమోదవుతున్న కేసులు చూస్తే నిజమే అనిపిస్తోంది. గత కొంత కాలంగా హైదరాబాద్​లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో దాదాపు 60 శాతానికి పైగా...జీహెచ్​ఎంసీ పరిధిలోనే కావటం ఆందోళన కలిగిస్తోన్న విషయం.

corona cases increasing in ghmc region
భాగ్యనగరాన్ని వణికిస్తోన్న వైరస్​ విజృంభణ
author img

By

Published : May 12, 2020, 7:02 AM IST

Updated : May 12, 2020, 9:41 AM IST

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ గ్రేటర్​ను వణికిస్తోంది. ఎన్నడూ లేనంతగా సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా 79 పాజిటివ్ కేసులు నమోదుకాగా... మొత్తం అన్ని జీహెచ్​ఎంసీ పరిధిలోనివే కావడం ప్రజల్ని ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 1,275 మంది మహమ్మారి బారిన పడగా.. 730కు పైగా కేసులు గ్రేటర్​ పరిధిలోనే ఉన్నాయి. గత పది రోజులుగా నమోదైన కేసుల్లో 90 శాతం భాగ్యనగర పరిధిలోనే ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేశాయి.

తగ్గుతున్నాయి అనుకునేలోపే..

హైదరాబాద్​లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో మలక్​పేట్ గంజ్​ మార్కెట్​లో ముగ్గురు వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకిన విషయం వెలుగు చూసింది. ఫలితంగా కొన్ని కుటుంబాల్లోనే వ్యాధి వేగంగా వ్యాపించి బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక వనస్థలిపురం, ఎల్బీ నగర్, మలక్​పేట, జియాగూడ ప్రాంతాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు గత కొంతకాలంగా కొవిడ్​ లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేసిన సర్కారు... గత రెండు మూడు రోజులుగా పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్​లనూ పూర్తి స్థాయిలో పరీక్షిస్తున్నందున కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

అత్యవసరాల్లో బయటకు వస్తేనే..

రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు జిల్లాల్లో ఒ‍క్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోగా... 26 జిల్లాల్లో గత 14రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం కేసులు విపరీతంగా పెరుగుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకురాకపోవటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవటం ద్వారా కొంతవరకు కరోనాకు దూరంగా ఉండవచ్చని ప్రజలను కోరుతున్నారు.

ఇదీ చూడండి: 'కరోనా ఎక్కువ కాలం ఉంటే.. ఆ సంస్థల పని అంతే'

Last Updated : May 12, 2020, 9:41 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.