ETV Bharat / state

అస్తవ్యస్త వ్యవస్థ.. కరోనాతో వణికిపోతున్న భాగ్యనగరం - హైదరాబాద్​లో కరోనా కేసులు

హైదరాబాద్‌ పరిధిలో నమోదవుతున్న కరోనా కేసులతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు, సిబ్బంది కొరత వేధిస్తుండగా, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత నెలకొంది. దీంతో కరోనా సోకిన వారిని ఇళ్ల వద్దనే ఉంచి చికిత్స అందించే విధానాన్ని మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

corona cases increased in hyderabad
పెరుగుతున్న కరోనా కేసులు.. వణికిపోతున్న భాగ్యనగరం
author img

By

Published : Jul 16, 2020, 10:40 PM IST

Updated : Jul 16, 2020, 10:55 PM IST

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో కరోనా వేగంగా విస్తరిస్తున్నది. కరోనా బాధితులతో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోయాయి. కాగా.. ప్రభుత్వం కరోనా సోకినవారిని ఇంటి వద్దనే ఉంచి.. చికిత్స అందించాలని సూచించింది. ఈ మేరకు.. 80 శాతం మంది కరోనా బాధితులు ఇంటి వద్దనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కాల్‌ సెంటర్‌ ద్వారా వారికి సూచనలు, సలహాలు ఇచ్చే విభాగాలను మరింత పటిష్టం చేసే ఆలోచనలో ఉన్నారు. జిహెచ్‌ఎంసీ పరిధిలో వేల మందికి పాజిటివ్‌ వచ్చిందని ఫోన్ల ద్వారా చెప్తున్న సిబ్బంది.. ఆ తరువాత వారికి ఎలాంటి గుర్తింపు నెంబర్లు ఇవ్వకపోవడం వల్ల వారికి కనీస వైద్య సదుపాయం, మందుల కిట్‌ కూడా చేరటం లేదు.

వైరస్‌ అనుమానితులతో పాటు సాధారణ సీజనల్‌ వ్యాధులతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో వైద్య విభాగాల్లో పరిస్థితి అదుపు తప్పుతోంది. చేసేదేం లేక కరోనా రోగులను ఇళ్ల వద్దనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా రోగులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన కాల్‌సెంటర్‌ వివరాలను ప్రభుత్వం మరింత ప్రచారంలోకి తీసుకు వచ్చింది. యాంటిజెన్‌ పరీక్షలు చేస్తున్న సిబ్బంది పాజిటివ్‌ వచ్చిన వారికి ఎలాంటి నిర్ధారణ పత్రం, ఫోన్‌ సమాచారం కూడా పంపించటం లేదు. దీంతో రోగి గుర్తింపు సమస్య ఎదురవుతోంది. జిహెచ్‌ఎంసీ ఇచ్చే వైద్య కిట్‌ కూడా వారికి అందటం లేదు. కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసినా వారు కూడా గుర్తింపు సంఖ్య అడుగుతుండటం వల్ల వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే ప్రాణాలు పోతాయని సోషల్‌ మీడియా వస్తున్న వీడియోలతో రోగులు జంకుతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందన్న ప్రచారంతో మదన పడుతూ భయాందోళనలతో జంటనగరాల పరిధిలో మొత్తం కరోనా పాజిటివ్​ కేసుల్లో 90 శాతం మంది ఇళ్లకే పరిమితమై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తోచిన మందులు వాడుతున్నారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ పరిధిలో గురువారం కూడా పాజిటివ్‌ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. కూకట్​పల్లి పరిధిలో 53, జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో 58, ఉప్పల్ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో 141 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 37 మందికి పాజిటివ్ వ‌చ్చింది. ఇతర ల్యాబ్​లలో పరీక్షలు చేసుకున్న వారిలో మరో 17 మందికి పాజిటివ్ తేలడం వల్ల మొత్తం 54 మందికి కరోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు అధికారులు వెల్లడించారు. మల్కాజ్​గిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 202 మందికి పరీక్షలు నిర్వహించగా 48కి పాజిటివ్​గా తేలింది. సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో 264 మందికి పరీక్షలు నిర్వహించగా 47 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో గురువారం కొత్తగా మరో 22 మందికి పాజిటివ్‌గా తేలింది. నగర శివారులోని కందుకూరు ఎంపీడీవో కార్యాలయంలో ఓ అధికారికి, ఇద్దరు స్థానికులకు కరోనా వచ్చింది. మండలంలో మొత్తం 111 మందికి పరీక్షలు చేయగా 7 మందికి పాజిటివ్​గా తేలింది. శామీర్‌పేట పరిధిలో మరో 12 మందికి కరోనా నిర్ధారణ అయింది. మొత్తంగా గురువారం ఒక్కరోజే.. 183 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం

Last Updated : Jul 16, 2020, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.