ETV Bharat / state

CORONA CASES: తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు - ap covid news

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్​ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 306 మందికి వైరస్​ సోకింది. ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,673 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 1,502 కరోనా కేసులు నమోదయ్యాయి.

CORONA CASES: తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

author img

By

Published : Sep 4, 2021, 11:22 PM IST

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 69,422 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 306 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,59,313కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,883కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 366 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,49,757కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,673 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఏపీలో..

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 1,502 కరోనా కేసులు నమోదయ్యాయి. 16 మంది కొవిడ్​తో మృతి చెందారు. 1,525 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 14,883 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లో 63,717మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

కరోనాతో చిత్తూరు జిల్లాలో మరో నలుగురు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో 260, చిత్తూరు జిల్లాలో 208 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 191, ప్రకాశం జిల్లాలో 152 కరోనా కేసులు బయటపడ్డాయి.

ఇదీ చదవండి: Bullettu bandi: బుల్లెట్టు బండి క్రేజ్... డుగ్గు డుగ్గు బండి స్కూల్ వెర్షన్ 2.O

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.