రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 88,308 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 409 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6లక్షల 54వేల 35కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
24 గంటల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,852కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 453 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 6,43,318కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 6,865 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: Minister KTR: త్వరలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్.. ముందుగా ఆ రెండు జిల్లాల్లోనే!