ETV Bharat / state

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 455 కరోనా కేసులు, 3 మరణాలు

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 455 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. వైరస్​ సోకి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 8,873 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 455 కరోనా కేసులు, 3 మరణాలు
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 455 కరోనా కేసులు, 3 మరణాలు
author img

By

Published : Aug 1, 2021, 7:51 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 83,763 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 455 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,45,406కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

24 గంటల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,805కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 648 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,32,728కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,873 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో కొందరు హోం ఐసోలేషన్​లో ఉండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జాగ్రత్తలు పాటించాలి..

18 ఏళ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్​ తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసు కూడా తప్పకుండా తీసుకోవాలని కోరుతున్నారు. మూడో వేవ్​ వచ్చే అవకాశం ఉండటంతో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. లక్షణాలు ఉంటే తప్పకుండా కొవిడ్​ పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.

ఇదీ చదవండి: cabinet: కొవిడ్ పరీక్షలు పెంచండి.. వ్యాక్సినేషన్​ను వేగవంతం చేయండి: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.