రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.82 శాతానికి చేరింది. కొత్తగా లక్షా 19 వేల 466 పరీక్షలు నిర్వహించగా.. 1,088 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మెుత్తం 6,17,776 కేసులకు చేరాయి. మరో 1,511 మంది కోలుకోగా మెుత్తం కోలుకున్న వారి సంఖ్య 6 లక్షలకు చేరువైంది.
వైరస్‌తో మరో 9 మంది మృతిచెందగా...మొత్తం మృతుల సంఖ్య 3,607 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,030 క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 137 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయినట్లు ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చదవండి: Vaccine for children: చిన్న పిల్లలకు టీకా ఎప్పుడు? ఎలా?