Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 52,714 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 683 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,82,252కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
కరోనా బారినపడి ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,104కి చేరింది. కరోనా నుంచి మరో 2,645 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,674 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు
Corona cases in India: భారత్లో కరోనా కేసులు వరుసగా రెండోరోజు తగ్గాయి. కొత్తగా 50,407 మందికి వైరస్ సోకింది. కొవిడ్ ధాటికి మరో 804 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,36,962 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.యాక్టివ్ కేసులు ప్రస్తుతం 1.43 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,25,86,544
- మొత్తం మరణాలు: 5,07,981
- యాక్టివ్ కేసులు: 6,10,443
- మొత్తం కోలుకున్నవారు: 4,14,68,120
దేశంలో కొత్తగా 46,82,662 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,72,29,47,688 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: