Corona cases in Telangana Today : దేశవ్యాప్తంగా ఇటీవల కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. జలుబు, జ్వరం వంటి లక్షణాలున్న వారిని గుర్తించి, చికిత్స అందించాలని స్పష్టం చేసింది. రానున్న పండుగల దృష్ట్యా అన్ని జిల్లాల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం సూచించింది. పాజిటివ్ నమూనాలను జీనోమ్ టెస్టింగ్‌కు పంపాలని పేర్కొంది.
కేరళలో ప్రస్తుతం 1634 యాక్టివ్ కేసులు(Covid Active Cases in Kerala) ఉండగా అందులో 111 కేసులు సోమవారం ఒక్కరోజే నమోదు అవడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్1(Omicron sub variant JN1) కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణాలోనూ 5 పాజిటివ్ కేసులు ఉన్నట్లు అధికారిక గణాంకాలు తెలిపాయి.
కొత్త కొవిడ్ వేరియంట్ కలవరం- రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
Covid Treatment Arrangements at Gandhi Hospital : రాష్ట్రంలో కొవిడ్ కేసులు నమోదవుతున్నందున ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం(Covid Treatment Ready at Gandhi Hospital)గా ఉన్నాయి. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఇందుకు సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు బయటపడలేదన్నారు.
Omicron sub variant JN1 Cases in Kerala : గాంధీ ఆసుపత్రిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని డాక్టర్ రాజారావు తెలిపారు. ఈ వేరియంట్‌లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు(Covid New Variant Symptoms) ఉంటాయన్నారు. కొంత మందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
'కొవిడ్ టీకా తీసుకుంటే ఆకస్మిక మరణాల ముప్పు తగ్గుతుంది'- ICMR నివేదిక
Doctors Instructions to old Peoples on Covid : వృద్ధులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు సమూహంగా ఉన్న జనంలోకి వెళ్లకపోవడం, మాస్క్ ధరించడం మంచిదని పేర్కొన్నారు. రోగనిరోధక శక్తి పెంచేందుకు సంతులిత ఆహారం తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తెలిపిన కొవిడ్ నియమాలను పాటించాలని సూచించారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని వెల్లడించారు.
Nipah Virus In Kerala : కొవిడ్‌తో పోల్చితే నిఫా చాలా డేంజర్.. ICMR బిగ్ వార్నింగ్!
మళ్లీ కరోనా కలకలం.. వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి.. W.H.O ఏమందంటే?