ETV Bharat / state

ముషీరాబాద్​లో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులు - corona effect

నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముషీరాబాద్​ నియోజకవర్గంలో నేటికి రెండు వేల కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు కొత్తగా మరో 20 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు తెలిపారు.

corona cases in musheerabad constituency

author img

By

Published : Jul 31, 2020, 8:10 PM IST

హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నియోజకవర్గంలో నేటికీ రెండు వేల కరోనా కేసులు నమోదయ్యాయని జీహెచ్​ఎంసీ వెల్లడించింది.

ముషీరాబాద్, బోలక్​పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 66 మందికి పరీక్షలు నిర్వహించగా... 9 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దోమల్​గూడాలోని గగన్​మహల్ పీహెచ్​సీలో 31 మందికి పరీక్షలు చేయగా 8 మందికి కరోనా సోకింది. లోయర్ ట్యాంక్​బండ్​లోని గోశాల సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి నిర్ధారణ అయింది.

ప్రస్తుతం 706 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా... 1246 మంది కోలుకున్నారు. కాగా... 47 మంది మృతి చెందారు.

ఇదీచదవండి: ఆకాశగంగా.. దూకింది పెంకితనంగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.